లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకూ ఒక్క హోంగార్డును విధుల నుండి తొలగించలేదని ఆ రాష్ట్ర హోంగార్డు మంత్రి చేతన్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలోని 25 వేల మంది హోంగార్డులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేవలం పని దినాలు మాత్రమే తగ్గించామనీ, ఇంకా పూర్తిగా ఉద్యోగాల నుండి తొలగించలేదనీ చౌహాన్ తెలిపారు. బడ్జెట్ పరమైన ఇబ్బందుల కారణంగా పని దినాలను 20 రోజులకు తగ్గించామని ఆయన చెప్పారు. విధుల నుండి ఎవరినీ తొలగించద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు చౌహాన్ చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్తోనూ చర్చిస్తానని చౌహాన్ తెలిపారు.
previous post
next post