అమరావతి: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓ మంత్రి కుమారుడు రోడ్డుపైనే భారీ హంగామాతో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం విమర్శలకు దారి తీసింది.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కోనసీమ ముఖ ద్వారం రావులపాలెం వంతెన వద్ద భారీ కాన్వాయ్‌తో జన్మదిన వేడుకల హంగామా చేశారు. ఇదే మాదిరిగా గత నెల 18వ తేదీన పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనయుడు వికాస్ పుట్టిన రోజు వేడుకలను అంబాజీపేట నడిరోడ్డుపై జరుపుకోవడంతో అయిదు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కోనసీమలో ప్రజాప్రతినిధుల కుమారులు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ఇలా నడిరోడ్డుపై జన్మదిన వేడుకల హంగామాలు చేయడం విమర్శలకు దారి తీస్తున్నది.