‘చంద్రబాబుకు ఆక్రోశం!’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్రోశంతో మాట్లాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎందుకు ఆక్రోశం అన్నది మాత్రం ఆయన వివరించలేదు. ఎఎన్‌ఐ వార్తా సంస్థకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చంద్రబాబుకు తెలంగాణపై ద్వేషం అని అన్నారు.

కెసిఆర్ పెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు మోదీ మద్దతు ఉందన్న చంద్రబాబు నాయుడి ఆరోపణను ప్రస్తావించినపుడు, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నవిషయమే తనకు తెలియదని ఆయన అన్నారు. చంద్రబాబు తెలంగాణాపై ద్వేషంతో ఏదో చేయాలనుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆక్రోశంతోమాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇంతకీ ఈ కూటములు ఎందుకు ఏర్పడుతునాయని ఆయన ప్రశ్నించారు. మహాకూటమి అన్న మాటకే అర్ధం లేదని ఆయన అన్నారు. ఒక వ్యక్తి లక్ష్యంగా పార్టీలు ఏకం అవుతాయా అని ఆయన ప్రశ్నించారు. మహాకూటమి గురించి చర్చించాల్సిన పనే లేదని ఆయన అన్నారు. తెలంగాణాలో కూటమి గతి ఏమయిందని ఆయన ప్రశ్నించారు. ఈ తరహా కూటమి రాజకీయాలను ప్రజలు తిప్పి కొడతారని ఆయన అన్నారు. జీవితాతం కాంగ్రెస్‌ను వ్యతిరేకిచిన వారు ఇప్పుడు మోదీ వ్యతిరేకతతో అదే పార్టీతో చేతులు కలుపుతున్నారని, అలాంటి వారిని కాంగ్రెస్ మింగేస్తుందనీ ఆయన అన్నారు.