రత్లామ్(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారపర్వంలో తనదైన శైలి ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటున్నారు. పార్టీకి ఓట్ల పరంగా ఏ మేరకు లాభం చేకూరుతుందో తెలియదు కానీ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. తన వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడమే కాక సందర్భోచితంగా ప్రవర్తిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇటీవల పాములు పడ్డే వాడి వద్దకు వెళ్లి అతని యోగ క్షేమాలు, కుటుంబ జీవనం తదితర విషయాలను తెలుసుకుంటూ పాములను చేతిలో పట్టుకుని మరీ చూపరులను ఆశ్చర్యచకితులను చేశారు.
తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రియాంక కారులో వెళుతుండగా మార్గమధ్యలో బిజెపికి చెందిన కొందరు యువతీ యువకులు మోది..మోది..మోది అంటూ నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ప్రియాంక గాంధీ వారి చర్యలకు ఏ మాత్రం రెచ్చిపోకుండా కారు దిగి చిరునవ్వులు చిందిస్తూ బిజెపి కార్యకర్తల వద్దకు వెళ్లి పలకరిస్తూ వారితో కలచాలనం చేసి ఆశ్చర్యపరిచారు. ‘మీ స్థానంలో మీరు ఉన్నారు. నా స్థానంలో నేను ఉన్నాను. ఆల్ ది బెస్ట్’ అని వారితో అన్నారు. ప్రియాంక చర్యలతో ఆశ్చర్యపోయిన బిజెపి కార్యకర్తలు వెంటనే తేరుకొని ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు వారిలో ఒక వ్యక్తి ఆమెను ఫోటో తీస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఎంపి కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది, వేలాది మంది నెటిజన్లు ఈ వీడియోకు లైక్లు ఇస్తున్నారు.
అదే మదిరిగా రత్లామ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ వద్ద ప్రియాంక బారికేడ్లను దాటుకొని పెద్ద సంఖ్యలో ఉన్న కార్యకర్తల వైపుకు వెళ్లారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెకు రక్షణ వలయంగా మారిపోయారు. అయినప్పటికీ ప్రియాంక అక్కడి ప్రజలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగారు.
इंदौर में कुछ लोगों ने प्रायोजित तरीक़े से मोदी-मोदी के नारे लगाए तो प्रियंका गांधी ने कार से उतर कर नारे लगाने वालों से हाथ मिलाया और कहा “आप अपनी जगह, मैं मेरी जगह ‘आल दी बेस्ट”।
इसे कहते हैं देश की मिट्टी, देश की जनता और देश के कण-कण से प्यार।
काश…मोदी भी देश को समझ पाते। pic.twitter.com/dEYL7CdaKI
— MP Congress (@INCMP) May 13, 2019
ఎఎన్ఐ సౌజన్యంతో….
#WATCH Priyanka Gandhi Vadra, Congress General Secretary for Uttar Pradesh (East) hops over a barricade to meet supporters during a public meeting in Ratlam, Madhya Pradesh. (13.5.19) pic.twitter.com/9pPnxOJn1k
— ANI (@ANI) May 14, 2019