వంద రూపాయల కాయిన్ ఇదే!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక నాణేన్ని ప్రభుత్వం విడుదల చేసింది. వంద రూపాయల విలువతో ఉన్న ఈ నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో సోమవారం విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వాజ్‌పేయి అసమానమైన వక్త అని శ్లాఘించారు. వాజ్‌పేయి ఇవాళ మన మధ్య లేరన్న విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ తదితరులు పాల్గొన్నారు. 2108 డిసెంబర్ 25 వాజ్‌పేయి 94వ జయంతి సందర్భంగా ఈ నాణెం విడుదలైంది.

 

 

 

 

 

 

 


Share

Related posts

రగులుతున్న లోహపురుషుడు

Kamesh

తెలంగాణలోనూ మూడు రాజధానులు కావాలట!

Mahesh

బలపరీక్షకు ఉద్ధవ్ సిద్ధం!

Mahesh

Leave a Comment