22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
Right Side Videos టాప్ స్టోరీస్

మోదీజీ! కాస్త పెద్దమనసు కావాలి.

Share

మనం చాలా గౌరవించే ఒక పెద్దమనిషి సంకుచితంగా ఆలోచిస్తున్నట్లు కనబడితే మనం ఏమనుకుంటాం? అదేంటి అంత పెద్దమనిషికి పెద్ద మనసు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతాం. ఆ పెద్దమనిషి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అయితే! ఈశాన్య భారతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మపుత్ర మీద నిర్మించిన ఈ వంతెన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు కీలకమైనది.

అప్పటి ప్రధాని హెచ్. డి. దేవెగౌడ 1997లో వంతెన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అయితే 2002లో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ నిర్మాణాన్ని ప్రారంభించేవరకూ పని మొదలు కాలేదు. ఇన్నాళ్లకు పూర్తయిన ఈ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ సందర్భంగా యూట్యూబ్‌లోని నరేంద్ర మోదీ ఛానల్‌లో వంతెన వివరాలతో ఒక వీడియో పోస్టు చేశారు. అందులో మోదీ, వాజ్‌పేయీ ప్రస్తావన ఉంది తప్ప అసలు మొదట శంఖుస్థాపన చేసిన దేవెగౌడ ప్రస్థావన మాట మాత్రంగా కూడా లేదు. దీనిని ఏమనాలి! ఆ! ఈ సంగతి ప్రధానికి తెలిసి జరుగుతుందా, వీడియో ఎవరో పోస్టు చేసి ఉంటారు కదా అనేవాళ్లు కూడా ఉండవచ్చు. వారికి తెలియాల్సింది ఏమంటే యధారాజా తథాప్రజా.

ఈ వీడియోను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.


Share

Related posts

సుజన చౌదరికి ఇడి షాక్

somaraju sharma

రాజధాని ప్రాంత అభివృద్ధిపై సమీక్ష

somaraju sharma

మోదీ .2 మొదటి వంద రోజుల్లో మదుపరులు కోల్పోయిందెంతో తెలుసా!?

Siva Prasad

Leave a Comment