NewsOrbit
టాప్ స్టోరీస్

అంతరిక్షంలో మన గూఢచారి

కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో
దట్టమైన మబ్బులున్నా ఫొటోలు
న్యూఢిల్లీ: ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టినా కూడా కింద ఏం జరుగుతోందో పసిగట్టగల సామర్ధ్యం ఉన్న గూఢచార ఉపగ్రహాన్ని భారతదేశం ప్రయోగించింది. దాంతో ఇక మీదట సైన్యం ఏదైనా ఆపరేషన్లు చేయాలంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 615 కిలోల బరువున్న రిశాట్ -2బి ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. పగలు, రాత్రితో పాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇది స్పష్టంగా చూడగలదు. ప్రత్యేకంగా రాడార్ సామర్ధ్యం కూడా ఉన్న ఈ ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల పైన గల కక్ష్యలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం, అడవులు, విపత్తు ప్రాంతాల పరిశీలనతో పాటు ప్రమాదకరంగా ఉండే ప్రదేశాలనూ ఇది పసిగడుతుంది. ఉపగ్రహ చిత్రాలను ఇస్రో ఇంకా విడుదల చేయలేదు.

ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్థాన్ భూభాగంలో సుదూరంగా ఉన్న బాలాకోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం తమ మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో దాడులుచేసింది. ఆ సమయంలో దట్టమైన మబ్బులు ఉండటంతో భారతీయ ఉపగ్రహాలు ఆ చిత్రాలు, వీడియోలను తీయలేకపోయాయి. దానివల్ల దాడులకు సాక్ష్యాలు లేకుండా పోయాయి. ఇప్పుడు కొత్తగా రాడార్ సామర్ధ్యం గల ఉపగ్రహం ఉండటంతో భారత సైనిక దళాలకు ఇస్రో పూర్తిస్థాయిలో సాయం అందించగలదు. తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు చెప్పగలదు. కార్టోశాట్ లాంటి ఉపగ్రహాలలో హై రిజల్యూషన్ కెమెరాలున్నా, దట్టమైన మబ్బులుంటే అవి పనిచేయవు.

అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ లో రూపొందించిన రిశాట్ -2బికి ప్రత్యేకంగా ఎక్స్-బ్యాండ్ రాడార్ అమర్చారు. ఇది మెరుగైన చిత్రాలు అందించగలదు. ఇలా స్వదేశంలోనే రూపొందిన గూఢచార ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు భారత్ ప్రయోగించిన రిశాట్-1, 2 ఉపగ్రహాలను ఇజ్రాయెల్ నుంచి సేకరించాం. వీటిలో మొదటిది 2017లోనే మరణించినట్లు చెప్పడంతో అది బాలాకోట్ దాడులను రికార్డు చేయలేదు. రిశాట్ -2 పంపిన చిత్రాలు స్పష్టంగా లేవు. మరోవైపు పాకిస్థాన్ కూడా గత సంవత్సరం జూలై 9న చైనీస్ లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా పాక్టెస్-1ఎ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇందులోనూ ఎక్స్-బ్యాండ్ రాడార్ ఉంది. రిశాట్-2బి ఐదేళ్ల పాటు పనిచేస్తుంది. అన్నీ బాగుంటే రాబోయే కొన్ని నెలల్లోనే రిశాట్ -బీఆర్1, రిశాట్ -2బీఆర్2 అనే మరో రెండు ఉపగ్రహాలను కూడా మనం ప్రయోగించే అవకాశముంది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment