(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఓ తల్లి మెరుపు వేగంతో కదిలి తన కుమారుడి ప్రాణం కాపాడుకున్నది. అబ్బురపరిచే వేగంతో ఆమె స్పందించిన తీరు వీడియో కెమేరాలో రికార్డయింది. సోషల్ మీడియాలో ఆ వీడియో పెద్ద స్థాయిలో వైరల్ అయింది.
కొలంబియాలోని మెడిలిన్ నగరంలో జరిగింది ఈ సంఘటన. సిసిటివి ఫుటేజిలో మొదట నాలుగవ అంతస్థులో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తల్లీకొడుకులు కనబడతారు. తల్లి ఫోన్ చూస్తుండగా చిన్న పిల్లవాడు కదిలి చువ్వలు లేని రైలింగ్ దగ్గరకు వెళతాడు. అక్కడ బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుండగా తలెత్తి చూసిన తల్లి మెరుపులా దూకి కిందపడుతున్న పిల్లవాడి చీలమండ పట్టుకుని వాడి ప్రాణాలు కాపాడుతుంది.
దీనికి యుట్యూబ్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాలామంది తల్లిని పొగడ్తలతో ముంచెత్తగా కొందరు భవనం రైలింగ్కు అడ్డు చువ్వలు లేకపోడమేమిటని ప్రశ్నించారు. వీడియో చూడండి: