కాలిఫోర్నియా: క్రీడా ప్రపంచంలో బాస్కెట్ బాల్ లెజండ్ గా పేరు తెచ్చుకున్న కోబ్ బ్రయంట్ ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన వయసు 41 సంవత్సరాలు. ఈ ప్రమాదంలో కోబ్ కుమార్తె జియానా(13)తో సహా తొమ్మిది మంది మరణించారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో కోబ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ కొండను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందారు. హెలికాప్టర్ మొత్తం కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. హెలికాప్టర్ లోని మృతదేహాలన్నీ గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి.
‘బ్లాక్ మాంబా’గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో సుప్రసిద్ధుడైన కోబ్.. దాదాపు 20 సంవత్సరాలకు పైగా క్రీడాభిమానులను అలరించారు. చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన టాప్-3 ప్లేయర్లలోనూ చోటు దక్కించుకున్నారు. అయిదు సార్లు అమెరికన్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బిఎ) ఛాంపియన్‌షిప్‌గా నిలిచాడు. బాస్కెట్‌బాల్ ఐకాన్ గా కొబ్ బ్రయంట్ పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా రెండు సార్లు ఒలింపిక్ స్వర్ణాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. కోబ్ మృతిపట్ల ఎన్బిఎ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది.
కోబ్ బ్రయంట్ మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. దేశంలో బాస్కెట్ బాల్ విస్తరణ, అభివృద్ధికి బ్రయంట్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ దుర్ఘటన అమెరికా క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదకరమైనదని ట్రంప్ అభివర్ణించారు.
https://twitter.com/realDonaldTrump/status/1221582230008619016
బ్రయంట్ మృతిపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. “‘బ్రియాంట్, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు” అని ట్వీట్ లో పేర్కొన్నారు.
Shocked & anguished to learn that my fave Kobe Bryant & his daughter no more ?
5x NBA champion
2x NBA finals MVP
4x All star MVP
2x NBA scoring champion
NBA slam dunk champion
No. 8, 24 retired by the LakersRIP & Tearful adieu to the fabulous #KobeBryant #BlackMamba pic.twitter.com/u0Mqwa2J9v
— KTR (@KTRTRS) January 27, 2020