NewsOrbit
టాప్ స్టోరీస్

ప్రపంచానికి గాంధీ 2.0 కావాలి!

న్యూఢిల్లీ: ప్రపంచం మారుతున్నందున గాంధీజీ 2.ఓ కావాలని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మా గాంధీని భారత్ కు, ప్రపంచానికి తిరగి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ.. బాలీవుడ్ ప్రముఖులను ఢిల్లీకి పిలిచి మరీ మీటింగ్ పెట్టారు. మహాత్ముడి ఆలోచనలను, సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సినీ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారుక్ ఖాన్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారన్న మోదీ… గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాలనూ వివరించారు.

ఈ సందర్భంగా నటుడు షారుక్ ఖాన్ మాట్లాడుతూ ‘మనం శుభ్రంగా ఉండాలని మనందరికీ తెలుసు. కానీ ప్రధాని మోదీ ఈ ఆలోచనను స్వచ్ఛా అభియాన్ తో తిగిరి ప్రవేశపెట్టారు. మనమందరం దాని గురించి తెలుసుకున్నాం. ప్రపంచం మారుతున్నందున గాంధీజీ 2.ఓ మనకు అవసరం’ అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తమను కలవడం ఎంతో ఆనందం కలిగించిందని షారుక్ ఖాన్ తెలిపాడు. గాంధీజీ గురించి ప్రధాని చెప్పిన తీరు అమోఘమని.. గాంధీ 2.0 అవసరమేమోననిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇకపై సినిమాల్లో గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాల్ని కూడా ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి అవకాశాన్ని తాము వినియోగించుకుంటామని, బాలీవుడ్ సినిమాని ప్రపంచవ్యాప్తం చేస్తామని షారుక్ చెప్పారు.

https://youtu.be/bMMJ1q3dJ8A

రంగం ఏదైనా.. ప్రముఖులు ఎవరైనా..ప్రధాని మోదీ ఎదుటివారి మనసును ఇట్టే దోచేస్తారు. సమయానికి తగ్గట్టు వ్యహారచనలు చేయడంలో మోదీని మించినోడు ఉండరనే చెప్పాలి. ఇప్పటివరకు దేశం కోసం ప్రధానులు వ్యవహరించని తీరులో పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. దేశ ప్రజలకు ఏదైనా సందేశం బోధించాలంటే.. అది ఒక్క సినిమా సెలబ్రిటీల వల్లే సాధ్యపడుతుంది. ఈ విషయం ప్రధాని మోదీకి బాగా తెలుసు. అందుకే బాలీవుడ్ దిగ్గజాలందరిని విందుకు పిలిచి.. గాంధీతత్త్వం గురించి కొన్ని నీతి బోధనలు చేసి.. ఆయన ఆశయాల్ని, మార్గాన్ని దేశ ప్రజలకు చెప్పండంటూ విన్నవించుకున్నారు. ఈ  కార్యక్రమం అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలందరూ తమ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment