ఖాట్మండు:: 18 ఏళ్ల నేపాలీ బాలిక బంధన ఏకంగా 126గంట పాటు గంటలు ఆగకుండా నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది.
తూర్పు నేపాల్లోని ధన్కుటా జిల్లాకు చెందిన బంధన వ్యక్తిగత విభాగంలో సుదీర్ఘ నృత్య మారథాన్లో ఈ ఘనత సాధించింది.
నేపాల్ ప్రధాని అధికారిక నివాసంలో బంధనను ప్రధాని కెపి శర్మ ఓలి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
బంధన కంటే ముందు భారతీయ బాలిక హేమలత 2011లో 123 గంటల 15 నిమిషాల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. హేమలత కంటే మరో రెండు గంటల 45నిమిషాలు అధికంగా నృత్యం చేసి బంధన ఈ అవార్డు కైవసం చేసుకుంది.