(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అవుట్లెట్ ఛాలెంజ్, ఐ ఫ్లాష్ ఛాలెంజ్ వెనక్కు వెళ్లాయి. తాజాగా స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ టిక్‌టాక్‌లో రాజ్యమేలుతోంది. స్పానిష్ భాషలో డ్రొమ్ప్రానియోస్ పేరుతో మొదలయిన ఈ ఛాలెంజ్‌పై ప్రస్తుతం అధికార యంత్రాగం దృష్టి సారించింది.
స్కల్ బ్రేకింగ్ అంటే పుచ్చ పగలగొట్టడం. ఈ వీడియోలో ముగ్గురు ఉంటారు. పక్కపక్కన నుంచుని ఉంటారు. ముగ్గురూ జంప్ చేస్తారు. అలా జంప్ చేస్తున్న క్రమంలో మధ్యలో నుంచున్న వ్యక్తిని కింద పడేయ్యాలి. వాడు వెనక్కు పడతాడు కాబట్టి పుచ్చ పగిలే అవకాశం లేకపోలేదు.
https://youtu.be/JD6Aj583WkQ
మొన్నా మధ్య ఈ ఛాలెంజ్ స్వీకరించిన ఒక వెనిజులా కుర్రవాడు తీవ్రంగా గాయపడ్డ వీడియో వైరల్ అంయింది. దానితో స్పెయిన్ అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఈ ఛాలెంజ్ కోసం ఆ పద్ధతిలో వీడియో తీయడం కోసం ప్రయత్నించవద్దని హెచ్చరిస్తున్నారు.