ముంబై: మహారాష్ర్టలోని పశ్చిమ కనుమల్లో ఓ కొత్త సర్పజాతికి కనుగొన్నారు జీవ వైవిధ్య పరిశోధకలు. దీనికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఠాక్రే పేరు పెట్టారు. ఆ కొత్త రకం పాముకు థాక్రే పేరుతో వచ్చేలా.. ‘ఠాక్రేస్ క్యాట్ స్నేక్’ గా నామకరణం చేశారు. ఈ పాము జాతిని కనిపెట్టడంలో తేజస్ చేసిన కృషి వల్ల ఈ పేరు పెట్టినట్లు పరిశోధకలు తెలిపారు. “బోయిగా థాకేరయి” అని సైంటిఫిక్ నేమ్ పెట్టారు. 125 ఏళ్లలో తొలిసారి ఈ రకమైన పామును కనుగొన్నారు. ఈ మేరకు తేజస్ ఠాక్రే సోదరుడు ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Boiga thackerayi sp. nov – Thackeray’s cat snake, a new species with Tiger like stripes on it’s body from the Sahyadri tiger reserve in Maharashtra! pic.twitter.com/gkdKjOpih4
— Aaditya Thackeray (@AUThackeray) September 26, 2019
ఈ పాములు ‘క్యాట్ స్నేక్’ జాతి కిందకు వస్తాయని, ఈ పాము జాతిని తేజస్ ఠాక్రే మొదటిసారిగా కనుగొని, వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఆ వివరాల్ని తమ సంస్థకు అందజేశారని జీవ వైవిధ్య సంరక్షణ సంస్థ డైరెక్టర్ వరద్ గిరి తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు సర్ప జాతికి ‘ఠాక్రేస్ క్యాట్ స్నేక్’ అని పేరు పెట్టినట్టు ఆయన తెలిపారు. ఈ పాము జాతి శాస్త్రీయ నామం ‘బోయిగా థకేరాయి’ అని ఆయన వెల్లడించారు. అడవుల్లో ఉండే నీటి ప్రవాహాల దగ్గర ఈ సర్పాలు కనిపిస్తుంటాయని పేర్కొన్నారు.