టాప్ స్టోరీస్

ఫేక్: మళ్లీ హిందూమతంలోకి జగన్

Share

‘‘జగన్ మోహన్ రెడ్డిని స్వరూపానంద సరస్వతి మళ్లీ హిందూమతంలోకి మార్చారు. ప్రమాణస్వీకారానికి స్వామి మే 30వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు’’

https://www.facebook.com/mnair.atc/videos/10156473974920945/

ఈ సందేశాన్ని ఒక వ్యక్తి తన ఫేస్ బుక్ పేజీలో మే 25న పోస్ట్ చేశారు. దాంతోపాటు కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో పెట్టారు. జన్మత: క్రిస్టియన్ అయిన జగన్ హిందూమతంలోకి మారినట్లు అందులో ఉంది. చాలామంది సోషల్ మీడియా యూజర్లు తమ ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఆ వీడియో షేర్ చేసుకున్నారు. ‘‘బ్రేకింగ్ న్యూస్: క్రిస్టియన్ మతం నుంచి హిందూమతంలోకి మారిన జగన్ మోహన్ రెడ్డి’’ అని అనేకమంది యూజర్లు ఇదే వీడియో పోస్ట్ చేశారు.

బజరంగీ దళ్ కోల్ కతా అనే ఫేస్ బుక్ పేజీలో దీనికి సంబంధించినవే కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. వాళ్లు కూడా ఇదే మాట అన్నారు.

వాస్తవం ఇలా..
జగన్ మోహన్ రెడ్డి వీడియోతో పాటు చేసిన ప్రచారం తప్పని తెలిసింది. అది 2016 ఆగస్టు నాటి వీడియో. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రిషీకేశ్ లో జగన్ మోహన్ రెడ్డి హోమం నిర్వహించారు. అది దానికి సంబంధించిన వీడియోనే.

పలువురు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేసిన ఫొటోలు కూడా ఆ కార్యక్రమానికి సంబంధించినవే. వాటిని 2016 అక్టోబరు 31న ఒక వెబ్ సైట్ అప్ లోడ్ చేసింది. ఇక్కడ చూపిస్తున్న ఫొటోలలో ఉన్నవాటినే సోషల్ మీడియాలో యూజర్లు షేర్ చేస్తున్నారు.

2019 ఏప్రిల్ నెలలో సీఎన్ఎన్-న్యూస్18కు జగన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రశ్న అడిగినప్పుడు కూడా ఆయన ‘‘నేను దేవుడిని నమ్ముతాను, ప్రతి రోజూ బైబిల్ చదువుతాను’’ అని చెప్పారు.

హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహించిన పాత వీడియోను తీసుకుని, జగన్ మోహన్ రెడ్డి హిందూమతంలోకి మారిపోయినట్లుగా తప్పుడు కథనాన్ని ప్రచారం చేశారు.


Share

Related posts

ప్రధాని మోదీ జాతిపిత అట!

Mahesh

పాక్‌లో హిందూ విద్యార్థిని హత్య!

Mahesh

అమరావతిని అమ్మేసేందుకు ప్రభుత్వం కుట్ర

Mahesh

Leave a Comment