స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో వన్ ప్లస్ కు ఇండియాలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫోన్ మాత్రమే కాదు వన్‌ప్లస్ ఉత్పత్తులకు ఇండియన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ సంస్థ తాజాగా బ్రాండ్ గ్లోబల్ మార్కెట్లోకి వన్ ప్లస్ అడుగుపెట్టి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ దేశ వినియోగదారులకు ఈమధ్య విడుదలైన ఆ సంస్థ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందిచేందుకు సిద్ధమైంది వన్ ప్లస్. అమ్మకాలు ప్రారంభించిన మొదటి నుండే ఈ సంస్థ అనుకున్న దాని కంటే మంచి అమ్మకాలనే చూసింది వన్ ప్లస్. తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో అధికంగా స్మార్ట్ ఫోన్లు అమ్ముడు చేసి నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ నే. దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ సంస్థకు భారతీయ మార్కెట్లో వన్ ప్లస్ స్థానం.
వన్‌ప్లస్ 7వ వార్షికోత్సవ సేల్ కింద ఈ బ్రాండ్ నుండి తాజాగా కొన్ని ఉత్పత్తులను తన మార్కెట్ విలువను పెంచుకోవడానికి త్వరలో భారీ డిస్కౌంట్లపై అందించనుంది. వీటిలో ముఖ్యంగా మిడ్-రేంజ్ 5G-ఎనేబుల్డ్ వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్, ఫ్లాగ్షిప్ వన్‌ప్లస్ 8-సిరీస్ స్మార్ట్ఫోన్లు, వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ మరియు వన్‌ప్లస్ బడ్స్ Z హెడ్ఫోన్లు మరియు వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇవే కాకా వన్‌ప్లస్ పవర్ బ్యాంక్‌ను రూ.777 ధరకు లభించనుంది. అంతేకాదు ఈ సేల్ లో అన్ని వన్‌ప్లస్ ఆడియో ఉత్పత్తులపై 10% తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఈ ఆఫర్లో రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు కొత్త ఆఫర్లను అదనంగా కేటాయించింది. కొత్తగా వన్‌ప్లస్ రెడ్ కేబుల్ లైఫ్‌ను పరిచయం చేయనుంది. దీనితో వినియోగదారులు 12 నెలల పొడిగించిన వారంటీ, 12 నెలల 50 జిబి క్లౌడ్ స్టోరేజ్ మరియు అమెజాన్ ప్రైమ్ యొక్క అదనపు 12 నెలల కాంప్లిమెంటరీ సభ్యత్వంతో సహా కొన్ని అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు అని తెలిపింది.
వన్‌ప్లస్ స్టోర్స్‌లో కొనుగోలు చేసే మొదటి 10 వన్‌ప్లస్ ‘8టి’ కస్టమర్లకు కాంప్లిమెంటరీ కింద రూ .3,000 యాక్సెసరీస్ కూపన్‌ను పొందుతారని సంస్థ తెలిపింది. ఆ తరువాతి 11 నుండి 30 మందికి రూ.2వేలు విలువచేసే కూపన్, ఆ తరువాత 30 నుండి 70 మందికి రూ .500 కూపన్లను పొందుతారన్నారు. అయితే, ఈ కూపన్లు జారీ అయిన ఒక నెలలోనే ఉపయోగం కోసం చెల్లుతాయి. వన్‌ప్లస్ శ్రేణి స్మార్ట్ టీవీలు అమ్మకం సమయంలో ఆకర్షణీయమైన ధరలకు కూడా లభించనున్నాయి. రూ.1,000 అదనపు తగ్గింపుతో రూ.13,999 వేలకే వై సిరీస్ 32-అంగుళాల వన్‌ప్లస్ టీవీ, 43-అంగుళాల టీవీ రూ .23,999 వద్ద లభిస్తుంది. వన్‌ప్లస్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోళ్లు చేసేటప్పుడు వన్‌ప్లస్ టివిలలో రూ .4,000 వరకు తక్షణ డిస్కౌంట్లను అందిస్తామన్నారు. కంపెనీ వెబ్ సైట్ తోపాటు వన్‌ప్లస్ స్టోర్స్ లలో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర భాగస్వామి స్టోర్లలోని కస్టమర్లకు డిసెంబర్ 2020 చివరి వరకు అందుబాటులో ఉండనుంది.