పాక్ మాజీ ప్రధాని నవాజ్‌కు ఏడేళ్ల శిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. శిక్షకు తోడు పాతిక మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ పాక్ అక్కౌంటబులిటీ కోర్టు నేడు తీర్పు చెప్పింది అయితే నవాజ్ షరీఫ్ పై ఉన్న ప్లాగ్ షిప్ ఇన్వెస్టిమెంట్ల కేసును కోర్టు కొట్టివేసింది. జాతీయ అక్కౌంటబులిటీ బ్యూరో నవాజ్ షరీఫ్ పై గత ఏడాది సెప్టెంర్ 8న మూడు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో అవెన్ ఫీల్డ్ ఆస్తుల కేసు ఒకటి కాగా, ఫ్లాగ్ షిప్ ఇన్వెస్ట్ మెంట్ల కేసు రెండోది.

ఇక మూడో కేసు అల్ అజీజియా స్టీల్ మిల్స్ అవినీతి కేసు. ఈ కేసులోనేఇప్పుడు అక్కౌంటబులిటీ కోర్టు నవాజ్ షరీఫ్ కు ఏడేళ్ల జైలు, పాతిక మిలియన్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే అవెన్ ఫీల్డ్ ప్రాపర్టీస్ కేసులో షరీఫ్ కు ఇదే కోర్టు గతంలోనే 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఫ్లాగ్ షిఫ్ ఇన్వెస్టిమెంట్ల కేసును కోర్టు కొట్టివేసింది.