ఇంగ్లీష్ మాధ్యమంలోనే చదువు చెప్పాలనే బిల్లుని ఏపీ ప్రభుత్వం పాస్ చేయడంపై తెలుగు భాషాభిమానులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలో పవర్‌స్టార్, జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా తెలుగు భాషలోనే విద్యను బోధించాలంటూ తనదైన శైలిలో గళమెత్తారు. తిరుపతిలో జరిగిన ప్రెస్మీట్లో ఆయన హీరోలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టాలీవుడ్లో తెలుగు మాట్లాడలేని హీరోలున్నారని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు హీరోల్లో చాలా మందికి తెలుగు చదవడం, రాయడం రాదని ఆయన విమర్శలు చేశారు.
నానాటికీ తెలుగు భాష పరిస్థితి దిగజారి పోతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకుల ద్వారా వచ్చే డబ్బులు అవసరం అవుతున్నాయి కానీ.. తెలుగు నేర్చుకోవాలని చాలా మందికి లేదని ఆయన ఘాటుగా మాట్లాడారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయడం లేదని, చేస్తాయని తాను అనుకోవడం లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలుగు భాష నేర్చుకుంటే ఇతర భాషలు సులభంగానే అర్థమవుతాయని ఆయన అన్నారు. తెలుగు పదాలను వెతుక్కుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలపై హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.
previous post