NewsOrbit
టాప్ స్టోరీస్

రాపాకకు పవన్ లేఖ.. పార్టీ నిర్ణయం ధిక్కరిస్తే!

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ.. కచ్చితంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆదేశించారు. మూడు రాజధానులకు మద్దతు ఇస్తానని.. వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేస్తానని ప్రకటిండచంతో పవన్ ఈ లేఖ రాశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిని తరలించేందుకు వీలుగా… ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే… మద్దతిస్తానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పడంతో ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై చర్చించిన పార్టీ… ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్… ఓ లేఖను రాపాకకు పంపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవల‌ప్‌మెంట్ రిజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని వ్యతిరేకించాలని ఆ లేఖలో తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై… పార్టీ నిర్ణయానుసారం నడుచుకోవాలని రాపాకను కోరారు.

“జనసేన పార్టీ శాసన సభ్యులు రాపాక వర ప్రసాదరావు గారికి.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని పార్టీలోని వివిధ స్థాయిలలో జరిగిన సమావేశాలలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. రాజధాని నిర్మాణం అమరావతిలోనే కొనసాగాలని, ప్రభుత్వ పాలన సంపూర్ణముగా అమరావతి నుంచే కొ నసాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ బరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని ఈ సమావేశాలలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ రోజు జరగనున్న సమావేశాలలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఈ క్రింది బిల్లులను ప్రవేశపెడుతున్న సంగతి మీకు విదితమే. పార్టీ నిర్ణయానుసారం ఎమ్మెల్యే రాపాక శాసనసభ సమావేశాలకు హాజరై.. ఏపీ అసెంబ్లీలో ఏపీ డిసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవలప్‌మెంట్ రీజియన్‌ యాక్ట్‌ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని ప్రవేశపెట్టే సమయంలో.. ఓటింగ్ సమయంలో వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాను” అని పవన్ లేఖలో పేర్కొన్నారు.

కాగా, ఒకవేళ రాపాక జనసేన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

 

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment