ప‌వ‌న్ ఎంట్రీ ఖ‌రారు


జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ప‌వ‌న్ రీ ఎంట్రీ గురించి కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ప‌లు ర‌కాల వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ వార్త‌ల‌కు నేటితో తెర‌ప‌డింది. అమితాబ్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `పింక్` చిత్రాన్ని తెలుగులో రీమేక్‌లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌తో పాటు తెలుగు నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నారు. ప‌వ‌న్‌తో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు చిత్రీక‌రణ‌కు సంబంధించిన విష‌యాల‌ను త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది. సినిమాల్లోకి ప‌వ‌న్ రీ ఎంట్రీ ఆయ‌న అభిమానుల‌కు పెద్ద శుభ‌వార్తే. 2018లో విడుద‌లైన `అజ్ఞాత‌వాసి` త‌ర్వాత ప‌వ‌న్ మ‌రో సినిమాలో న‌టించ‌లేదు.