NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

PK Team: రాజకీయ వ్యూహరక్త ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్ వైసీపీతో పని చేస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్ ఏపి రాజకీయ వర్గాల్లో ఉంది. ఎందుకంటే ఇటీవల ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పీకే టీమ్ మా పార్టీతో పని చేయడం లేదని పేర్కొన్నారు. అయితే పీకీ టీమ్ వైసీపీతో పని చేస్తొంది. పీకే టీమ్ అంతర్గత ప్రణాళికలు ఏమిటి..? వాళ్లు ఎంత మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు..? ఏన్ని ఓట్లకు ఒక కోఆర్డినేటర్ ఉంటారు..? పికే టీమ్ రిక్రూట్ మెంట్ ఎలా జరుగుతుంది..? ఎన్నికల ప్రణాళికలు ఏ విధంగా  ఉంటాయి..? ఏపిలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనలు ఏమిటి..? అనే విషయాలను పరిశీలిస్తే..

PK Team Recruitment done for AP

PK Team: పీకే టీమ్ ఇంటర్వ్యూలు

రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పని చేసేందుకు 1500 మందిని రిక్రూట్ మెంట్ చేసుకుంటోంది. ఇందు కోసం రెండు నెలల నుండి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫోన్ కాల్ ఇంటర్వ్యూలు, ఆన్ లైన్ పరీక్షలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు డైరెక్ట్ ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు. నాలుగు వేల మందిని పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలిపించారు. ఈ నాలుగు వేల మందిలో 1500 మందిని ఫైనల్ టీమ్ గా ఎంపిక చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 8 నుండి 10మంది టీమ్ సభ్యులు పని చేస్తారు. 25 మంది ఓటర్లకు ఒక టీమ్ సభ్యుడు కోఆర్డినేట్ చేస్తారు. వీళ్లు ఆ గ్రామాల్లో నాయకుల పనీతీరు ఎలా ఉంది. పార్టీ పరిస్థితి ఎలా ఉంది. వైసీపీ, టీడీపీ బలాబలాలు అనే విషయాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇస్తూంటారు. అదే విధంగా ఆ గ్రామంలో ఏ నాయకుడిని నమ్ముకుంటే బాగా పని చేస్తారు. ఏ నాయకుడు అనుకూలంగా పని చేస్తారు. పోల్ మేనేజ్‌మెంట్ కు ఎవరైతే సమర్ధవంతంగా పని చేస్తారు, ఏ నాయకుడు ద్వారా బూత్ లెవల్ పాలిటిక్స్ చేయవచ్చు అనేవి వీళ్లు గుర్తిస్తారు.

PK Report: Prasanth Kishore Secret Report to YS jagan

PK Team: జులై నెలలో సీఎం జగన్ తో భేటీ..?

ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్, సోషల్ ఇంజనీరింగ్ చాలా కీలకం. దీనిపైన ఈ టీమ్ సభ్యులు దృష్టి పెడతారు. ఇటువంటి వాటిలో పీకే టీమ్ దిట్ట. దాదాపు 1500 మంది పీకే టీమ్ సభ్యులు వైసీపీ కోసం పని చేసేందుకు జూన్ 15 తరువాత ఏపిలో అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి అయ్యింది. ఈ సర్వేలకు అనుగుణంగా ఈ 1500మందిని ఎక్కడెక్కడకు పంపాలనేది డిసైడ్ చేస్తారు. ఇదే క్రమంలో జూలై నెలలో సీఎం వైఎస్ జగన్ ను ప్రశాంత్ కిషోర్ కలవనున్నారని సమాచారం. ఆ బేటీలో సర్వే రిపోర్టు అందజేసి నియోజకవర్గాల్లో పరిస్థితిని వివరించే అవకాశాలు ఉన్నాయి.

author avatar
Special Bureau

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N