(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. క్యూబా నుండి అమెరికా వెళుతున్న బోయింగ్ 737 విమానం రన్వే నుండి జారిపోయి నదిలో పడిపోయింది.
ప్రమాద సమయంలో విమానంలో 136మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
క్యూబా నుండి అమెరికా వెళుతున్న బోయింగ్ 737 విమానం ఫ్లారిడాలోని జాక్సన్విల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి రన్వే సమీపంలో గల సెయింట్ జాన్స్ నదిలో పడిపోయింది.
ఈ విమానం నదిలో మునగకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదనీ, 21 మందికి మాత్రం గాయాలు అయ్యాయని జాక్సన్విల్లీ మేయర్ ప్రకటించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.
నావికాదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.