(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇంట్లో పంజరంలో ఉండాల్సిన చిలుక.. దొంగతనం చేసినందుకు పోలీసు పంజరంలోకి వెళ్లింది. ఈ విచిత్రమైన ఘటన నెదర్లాండ్స్లో జరిగింది. వివరాల్లోకి వెళితే… నెదర్లాండ్స్లో ఓ దొంగ రాత్రివేళ చోరీకి వెళ్లాడు. ఓ షాప్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి… కొన్ని విలువైన వస్తువులను దొంగలించేందుకు ప్రయత్నించాడు. ఈ చోరీ మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో పోలీసులు ఆ దొంగను కనిపెట్టి.. అతన్ని పట్టుకొని జైల్లో పెట్టారు. అయితే, సీసీ కెమెరాల్లో మరో విషయం కూడా గుర్తించారు. చోరీ చేస్తున్నప్పుడు ఆ దొంగతోపాటూ అతను పెంచుకునే చిలుక కూడా వెంట వెళ్లిందని కనిపెట్టారు. చోరీ జరుగుతున్నంతసేపూ ఆ చిలుక దొంగ భుజంపైనే ఉంది. ఈ దొంగతనంలో ఆ చిలుక కూడా పాల్గొన్నట్లే అని పోలీసులు ఫిక్స్ అయ్యారు. దాన్ని కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దానికి ఓ బ్రెడ్డూ, నీళ్లు పెట్టారు. ఇందకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Thinking about how the Dutch police arrested a bird for taking part in a robbery, put it in a jail cell with bread and water & when the media reported on it they put a little black bar over the face to protect its identity pic.twitter.com/2ly0zsoAw6
— Emma (@CampbellxEmma) September 29, 2019
https://www.instagram.com/p/B23cLVtBa7k/?utm_source=ig_embed
గతంలో డ్రగ్స్ కేసులో ఓ చిలుకను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బ్రెజిల్లో స్మగ్లింగ్ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లగా.. ఓ చిలుక ‘మమ్మా.. పోలీస్’ అంటూ గట్టిగా అరిచింది. దీంతో అలర్ట్ అయిన స్మగ్లర్లు ఇంటి కిటికీల్లో నుంచి దూకి పారిపోయారు. దీంతో పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆ చిలుకను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ చిలుక మీద కేసు పెట్టారు. దానిపై విచారణ కూడా జరిగింది. చిలుక మీద కేసు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2010లో కొలంబియాలో ఓ చిలుక కూడా ఇలాగే చేసిందట. పోలీసులు ఓ ఇంటి మీద రైడ్ చేసిన సమయంలో తన ఓనర్కు ‘రన్, రన్’ అంటూ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దానిపై కేసు పెట్టారు.