ఎన్నికలకు వేళాయె!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు టీడీపీ అసంతృప్త నాయకులను అకర్షించేందుకు ఆపరేషన్‌ అకర్ష్‌లను మెదలు పెట్టారు. పాదయాత్ర 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకుని వైెఎస్ జగన్ తనదైన శైలిలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు.

ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ క్షేత్రస్ధాయి నేతలు అందరూ ప్రజల వద్దకు వెళ్ళాలని దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై ఫ్రజాభిమానాన్ని చూరగొనాలని సూచించారు. ఇప్పటికే బలహీనవర్గాలకు ఇళ్లు,పెన్షన్, రేషన్ వంటివి అర్హలందరికీ అందిచామని చెప్పారు. ఆదరణ పథకం కింద  ఇక నుంచి  90 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సీఎం తెలియజేశారు. నేతలంతా ప్రజల్లోనే ఉండాలని, జన్మభూమిలో చురుగ్గా పాల్లొనాలని, ఇప్పటిదాకా ఏం చేశామో చెప్పాలనీ, మరే రాష్ట్రంలో  జరగనంత అభివృద్ది మన దగ్గర జరిగిందనీ ఆయన వివరించారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగాలంటే మళ్లీ మనల్నే అశీర్వదించాలంటూ ప్రజలను కొరాలని చంద్రబాబు చెప్పారు.

పవన్ ట్వీట్

ఇదిలావుండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజలందరికి అందుబాటులో ఉండేదుకు అమరావతిలోనే ఉంటానని, క్షేత్రస్ధాయిలో జనంతో మమేకం అవుతానని ప్రకటించారు. అమెరికా నుండి తిరిగి వచ్చాక పవన్ రాయలసీమలో తన ప్రజాపోరాటయాత్రను కొనసాగించనున్నారు.

రాష్ట్రంలో చేసిన అభివృద్దిని, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలలోకి వెళ్ళాలని టీడీపీ భావిస్తుంటే, టీడీపీ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ముందకు సాగాలని వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను దాటుకుని కేసీఆర్ తిరిగి అధికారంలోకి రాగలగడం చంద్రబాబు నాయుడుకు ఒక సానుకూల పరిణామం కాగా, తెలంగాణలో చంద్రబాబు సృష్టించిన కూటమి పరాజయం పాలవడం ఏపీ విపక్షాల చేతికి మరో ఆయుధాన్ని అందించిందనే చెప్పాలి.