(ఫైల్ ఫోటో)
ఢిల్లీ: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహం రద్దు అయినట్లు సమాచారం. తన ప్రియురాలు ఇషిత కుమార్తో సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగింది. కొద్ది రోజుల్లో వీరి వివాహం జరగాల్సిన తరుణంలో వివాహం వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి.
వారి వివాహం పూర్తిగా రద్దు అయినట్లు హిందూస్థాన్ టైమ్స్, ఇండియా టుడే లాంటి ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఇషిత వ్యక్తిగత సోషల్ మీడియాలో చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా వివాహం క్యాన్సిల్ అయినట్లు ప్రకటించాయి. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సిద్ధార్ధ్తో కలిసి ఉన్న ఫోటోలను ఇషిత తొలగిస్తూ వస్తోంది. వారి నిశ్చితార్థం ఫోటోలు కూడా తొలగించడం జరిగింది. వీరి నిశ్చితార్థం ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగింది.
ఇషిత ఇన్ట్సాగ్రామ్లో పెట్టిన పోస్టింగ్ అసలు విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ‘కొత్త ప్రారంభానికి ఛీర్స్. అందమైన ముగింపుకు గుడ్ బై కిస్’ అంటూ ఆమె పోస్టు చేసింది. పాత పుస్తకాన్ని మూసేయ్ అంటూ ఇషిత తల్లి నిధి కుమార్ కూడా కామెంట్స్ పెట్టడం గమనార్హం.
https://www.instagram.com/p/Bw8gtKUgegQ/?utm_source=ig_embed