‘‘బ్రేకింగ్ న్యూస్
*ప్రియాంకా వాద్రా* నాలుగు పెగ్గుల *వోడ్కా* తాగి మత్తులో మునిగారు
ఆమె తన సొంత పార్టీ మహిళా కార్యకర్తనే కొడుతున్నారు (అది నేనే)
వాహ్ రే కాంగ్రెస్
కానీ ఎవరూ దీన్ని కవర్ చేయరు
అందువల్ల నా తరఫున దీన్ని షేర్ చేయండి
ధన్యవాదాలతో
రుబినా మాలిక్
(మాజీ కాంగ్రెస్ ప్రతినిధి)’’
తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్ చార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చుట్టూ కొంతమంది ఉండి, ‘‘అడ్డు తప్పుకోండి’’ అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అయింది. ఈ వీడియోతో పాటు ఉన్న సందేశంలో, అప్పటికి ఆమె మద్యం మత్తులో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యకర్తను కొట్టారని అన్నారు. ఈ ఘటనకు మీడియా కవరేజి రాలేదని కూడా చెప్పారు. బాధిత మహిళ రుబినా మాలిక్ పేరుతో ఈ వీడియో చక్కర్లు కొట్టింది.
సుకేష్ శెట్టి అనే వ్యక్తి ఈ వీడియోను అర్ణబ్ గోస్వామి ఫ్యాన్ క్లబ్ అనే ఫేస్ బుక్ గ్రూపులో పోస్ట్ చేశారు. సీమా త్రివేది అనే ట్విట్టర్ యూజర్ కూడా ఇదే వీడియోను ఇదే వర్ణనతో పోస్ట్ చేసి, ప్రియాంకా గాంధీ తాగి ఉన్నట్లుగా చెప్పారు.
ఇంకా చాలామంది ఫేస్ బుక్, ట్విటర్ యూజర్లు కూడా ఇదే వీడియోను ఇదే సందేశంతో షేర్ చేశారు.
పాత వీడియో, తప్పుడు వివరణ
ఈ తప్పుడు క్లెయిమును 2019 జనవరిలోనే ఆల్ట్ న్యూస్ ఛేదించింది. కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అర్ధరాత్రి చేసిన ఆందోళన ఘటన ఇది. తనను, తన పిల్లలను ఆ ర్యాలీలో తోసేస్తుండటంతో ప్రియాంకా గాంధీ ఆగ్రహానికి గురయ్యారు. ర్యాలీకి వచ్చినవారిలో కొందరు తాగి ఉండటంతో వారిని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. వాళ్లు బ్యారేకేడ్లు దాటి, వాటిని విరగ్గొట్టారని తెలిపింది. ఇండియా గేట్ వద్ద రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని తెలిపింది. ఈ నిరసన ప్రదర్శనలో ప్రియాంకను జనం తోసేశారని న్యూస్18 కూడా చెప్పింది. అసలు రుబినా మాలిక్ అనే పేరుతో కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరూ లేరని గూగుల్ సెర్చ్ చెప్పింది.
ప్రియాంకాగాంధీ జనం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న పాత వీడియోను తీసుకుని, దాన్ని తప్పుడు క్లెయిముతో ప్రచారం చేశారు. తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైనప్పటి నుంచి ప్రియాంకా గాంధీని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
(ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో)
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…