హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోర్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి ప్రాంత రైతులతో హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధాని ప్రాంత రైతాంగం వారి ఇబ్బందులను, సందేహాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాల్సిందేననీ, ఏమైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే వాటిని సరిచేయాల్సి ఉంటుందని చేప్పారు. నూతన ప్రభుత్వాలు పాత ప్రభుత్వ నిర్ణయాలను పూర్తిగా పక్కన బెడితే వ్యవస్థలపైనే ప్రజలకు నమ్మకం పోతుందని పవన్ అన్నారు.
రాజధాని అమరావతి నుండి తరలించడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను అయోమయానికి గురి చేసేలా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడటం మంచిది కాదని పవన్ అన్నారు. రాజధాని ప్రాంతంలో ఎంత మేర అభివృద్ధి జరిగిందే అనే విషయాలపై త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులకు జనసేన అండగా ఉంటుందని, ఈ నెల చివరి వారంలో గానీ వచ్చె నెల మొదటి వారంలో గానీ రాజధాని ఏరియాలో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
పవన్‌తో ముఖాముఖి వీడియో కోసం కింద క్లిక్ చేయండి..