చెన్నై: ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ తో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా అడవుల్లో సంచరించడం అద్భుతమని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. సాహసికుడు బేర్ గ్రిల్స్ , డిస్కవరీ చానల్ కు రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. డిస్కవరీ ఛానల్ లో ప్రసారమవుతున్న ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమం రజనీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. తాజాగా రజనీకాంత్ ను కూడా బేర్ గ్రిల్స్ తన వెంట కొండకోనల్లో తిప్పాడు. ప్రకృతిలో ఎలా మనుగడ సాగించాలో చేసి చూపించాడు. కర్ణాటకలోని బండిపుర అడవుల్లో సాహసాలు చేశారు. ఈ క్రమంలో రజనీ స్వల్ప గాయాలపాలయ్యారు. అయితే, ఇదో మరుపురాని అనుభవం అని రజనీకాంత్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం త్వరలోనే డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది.
Thank you very much dear @BearGrylls for an unforgettable experience … love you. @DiscoveryIN thank you ?? #IntoTheWildWithBearGrylls
— Rajinikanth (@rajinikanth) January 29, 2020
గతంలో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ ప్రోగ్రామ్ యాంకర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్‌లో సాహసయాత్ర చేశారు. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో తమిళ నటుడు రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ షోలో ఇంతకు ముందు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా పాల్గొని బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో మోదీ తర్వాత పాల్గొన్న రెండో భారతీయ వ్యక్తిగా రజనీ నిలిచారు.
మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో బేర్ గ్రిల్స్.. అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ… సాహసాలు చేస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అందులో భాగంగా ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. అందుకే ఈ షోకి మంచి ఆదరణ ఉంది.
Rajinikanth on Into The Wild with Bear Grylls: Looking forward to the survival challenge! #IntoTheWildwithBearGrylls https://t.co/jx5xmE49tr via @IndianExpress
— Bear Grylls (@BearGrylls) January 29, 2020
After our episode with Prime Minister @NarendraModi of India helped create a bit of TV history, (3.6 billion impressions), superstar @Rajinikanth joins me next, as he makes his TV debut on our new show #IntoTheWildWithBearGrylls on @DiscoveryIN. #ThalaivaOnDiscovery pic.twitter.com/WKscCDjPZc
— Bear Grylls (@BearGrylls) January 29, 2020