పెరోల్‌పై నళిని విడుదల

Share

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ నెల రోజుల పెరోల్‌పై గురువారం వెల్లూరు జైలు నుండి విడుదలైంది. తన కుమార్తె హరిత్రా పెళ్లి ఏర్పాట్ల కోసం ఆరు నెలల పాటు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ నళిని ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అమె అభ్యర్థనపై విచారణ జరిపిన న్యాయస్థానం నెల రోజులు పెరోల్ ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నళిని తల్లి, మరో మహిళ ఇచ్చిన పూచికత్తుపై ఈ పెరోల్ మంజూరు చేసింది. అయితే పెరోల్‌పై బయట ఉన్న సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, రాజకీయ నాయకులను కలవొద్దని న్యాయస్థానం షరతులు విధించింది.
నళిని కుమార్తె హరిత్ర యుకెలో మెడిసిన్ చదువుతోంది. ఆమె వచ్చే వారం ఇండియాకు రానుంది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు నళిని, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్ ఎల్‌టిటిఈ ఉగ్రవాదులతో కలిసి వ్యూహరచన చేశారు. కేసులో నళిని మురగన్‌ సహ ఏడుగురు దోషులుగా తేలారు. నళినికి తొలుత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆ తరువాత 24ఏప్రిల్ 2000న ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. గత 27సంవత్సరాలుగా నళిని వేలూరులోని మహిళా జైలులో శిక్షణ అనుభవిస్తుండగా, ఆమె భర్త మురుగన్ వేలూరు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

 

 


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

14 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

15 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

1 hour ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago