NewsOrbit
టాప్ స్టోరీస్

ప్రగతిభవన్ వద్ద టెన్షన్.. టెన్షన్..!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రగతి భవన్ ముట్టడిని భగ్నం చేయడం కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పలువురు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి పోలీసులను తప్పించుకొని బైక్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి వచ్చారు. ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బైక్ వచ్చిన ఆయనను ఆపేసి, అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ వద్ద నుంచి బలవంతంగా పోలీసు వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రవాప్తంగా కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. కొందరు నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి విఫలయత్నం చేశారు. దీంతో సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్‌తోపాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యక్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ కు తీవ్ర గాయమైంది. ఉద్రిక్తత నడుమ కాంగ్రెస్ నాయకులని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముఖ్యనాయకులను వారి ఇళ్ల వద్దే గృహ నిర్బంధం చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు పొన్నాల, పొన్నం ప్రభాకర్, జానారెడ్డి, సంపత్ కుమార్, శ్రీధర్ బాబు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులను గృహ నిర్బంధం చేశారు. అటు జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

ప్రగతిభవన్ కి రావడానికి ముందు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అంజన్ యాదవ్, రాములు నాయక్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నానని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించనందుకు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు కీలక నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీలను హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్‌లో డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్‌రెడ్డికి గృహ నిర్బంధం విధించారు. అలాగే, వర్ధన్నపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ఎల్బీనగర్‌లలో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి తరలి వస్తున్న జగిత్యాల, సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలను సైతం కేసీఆర్‌ ధిక్కరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా సర్కార్ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో 50 వేల ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు.

మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు, పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరం అవుతోంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సమ్మెను మరింత తీవ్రతరం చేయాలనీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. పది రోజుల కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ నెల 30న సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment