(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రతి సంవత్సరం రంజాన్ పండగ రోజు అభిమానుల ముందుకు రావడం హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు అలవాటు. ఆ రోజు గాలాక్సీ అపార్ట్మెంట్లోని తన ఇంటి బాల్కనీలో సల్మాన్ ప్రత్యక్షం అవుతాడు. ఎప్పటిలాగా నిన్న కూడా సాయంత్రం పూట సల్మాన్ బాల్కనీలోకి వచ్చాడు. అప్పటికే అక్కడ అతని అభిమానులు కిక్కిరిసి ఉన్నారు. సల్మాన్ బాల్కనీలోకి రాగనే ఫ్యాన్స్ అనందానికి అవుధులు లేవు.
53 ఏళ్ల ఈ సూపర్ స్టార్ తన బాల్కనీలోనుంచే తీసిన ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అభిమానుల కేరింతలు తారాస్థాయికి చేరుతుండగా పక్కన సెక్యూరిటీ గార్డులతో సల్మాన్ చేయి ఊపుతూ అభివాదం చేశాడు. ఇంతలో అక్కడకు వచ్చిన తన తల్లి సల్మా ఖాన్‌తో కూడా అభిమానులకు అభివాదం చేయించాడు. చివరలో సల్మాన్, సల్మాన్ అంటూ అభిమానులు నినదిస్తుండగా ఫైనల్‌గా చేయి ఊపి లోపలికి నిష్క్రమించాడు.
https://www.instagram.com/p/ByVMS6alo76/?utm_source=ig_web_copy_link