హిందీ ‘అర్జున్ రెడ్డి’ తాజా లుక్ ఇదే!

 

(న్యూస్ ఆర్బిట్ సినిమా డెస్క్)

విజయ్‌ దేవరకొం‍డ హీరోగా వచ్చి స్మాషింగ్ హిట్ సాధించిన  అర్జున్‌ రెడ్డిని షాహిద్‌ కపూర్ హీరోగా హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా కబీర్‌ సింగ్‌  టైటిల్‌‌తో విడుదల కానుంది. కాగా, తాజాగా ఇప్పుడు కబీర్ సింగ్ లుక్‌ను షాహిద్‌ సెట్స్ నుంచి షేర్ చేశారు. ఇందులో షాహిద్  క్లీన్‌ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా కనిస్తున్నాడు.

టీ సిరీస్‌, సినీ 1 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బాలీవుడ్ మూవీలో కియారా అద్వానీ ఫెమేల్ లీడ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.కబీర్ సింగ్ 2019 జూన్‌ 21న రిలీజ్ కానుంది. ఇదిలావుంటే, ధృవ్‌ హీరోగా బాల డైరెక్షన్‌లో అర్జున్‌ రెడ్డి తమిళ రీమేక్‌ కూడా జోరుగా సాగుతోంది.