బిగ్ బాస్ 4 vs వంటలక్క : బిగ్ బాస్ ని చావుదెబ్బ కొట్టి చిత్తుగా ఓడించిన వంటలక్క !

`కార్తీక దీపం’ తెలుగు టీవీ ప్రే‌క్ష‌కుల ఫేవ‌రెట్ సీరియ‌ల్‌. ‌ ఈ సీరియల్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియల్‌ ఇది. రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇళ్లలోని టీవీల్లో కార్తీక దీపం కనిపిస్తుంటుంది. అంతేకాదు స్టార్ హీరోల హిట్టు సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో వంటలక్కతో పోటీపడలేకపోతున్నాయి.

అన్నింటా హిట్టే హిట్టు….

కార్మీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ పిల్లల సెంటిమెంట్ తో సీరియల్ ఊపు ఊపేస్తోంది. అదే స‌మ‌యంలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. భారీ క్రేజ్‌ ఉన్న కార్తీక దీపం సీరియల్ దర్శకనిర్మాతలు అభిమానుల కోసం మరో గుడ్‌న్యూస్ చెప్పారు. మామూలుగా ఈ సీరియల్ నిడివి 30నిమిషాల పాటు ఉండనుండగా.. ఇప్పుడు మరో 15 నిమిషాలకు పెంచారు. `కరుత ముతు` అనే మలయాళం సీరియ‌ల్‌ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సీరియల్. ఆ సీరియల్ లో హీరోయిన్ గా చేస్తున్న ప్రేమీవిశ్వనాద్ తెలుగులోనూ హీరోయిన్ దీపగా చేస్తోంది. ఇక ఈ సీరియల్ ఇప్పటివరకూ తమిళం, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా రీ మెక్ అయి ప్రసారం అవుతోంది. అన్ని భాషల్లోనూ ఈ సీరియల్ సూపర్ హిట్టే.

ఊపు ఊపేస్తోన్న కార్తీక‌దీపం

కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్‌లో రికార్డులు బ‌ద్దలు కొడుతోంది. మొత్తం 4.2 కోట్ల మంది చూస్తుండ‌టం ద్వారా కార్తీకదీపం సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం జాతీయ స్థాయిలోనే అత్యధిక రేటింగ్స్ సాధించిన సీరియల్‌గా నిలిచింది. అదుకే టీఆర్పీ రేటింగ్ 20.7 గా నమోదు అయింది. ఈ రేంజి రేటింగ్ సాధించిన సీరియల్ ఇండియాలో ఇదొక్కటే. మ‌రోవైపు భారీ ఆశ‌లు పెట్టుకున్న బిగ్‌బాస్ సీజ‌న్ 4 వంట‌ల‌క్క కంటే వెనుక‌బ‌డిపోయింద‌ట‌. బిగ్‌బాస్ 4 టీఆర్పీ వారం వారం త‌గ్గిపోతుండ‌గా మ‌రోవైపు వంట‌ల‌క్క సీరియ‌ల్ మాత్రం త‌న‌దైన శైలిలో ప‌ట్టు సాధిస్తోంది.

ఆరు క్యారెక్ట‌ర్లే ఆయువుప‌ట్టు

ఆరు క్యారెక్టర్లు ఆయువు ప‌ట్టుగా కార్తీక‌దీపం సీరియ‌ల్ దూసుకుపోతోంది. వంటలక్క దీప (ప్రేమీ విశ్వనాద్), కార్తీక్ (పరిటాల నిరుపమ్), కార్తీక్ తల్లి సౌందర్య (అర్చన అనంత్), మౌనిత (శోభాశెట్టి), పిల్లలుగా శౌర్య (కృతిక) హిమ (సహృద). ఈ ఆరు కారెక్టర్ల చుట్టూ తిరిగే ఈ కథలో ప్రతి వారం ఎదో మలుపు ఉంటుంది. ఆ మలుపే ఈ సీరియల్ కు ప్రాణం. ఇక దీప కారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కారెక్టర్ ఇప్పుడు వంటలక్కగా దాదాపుగా ప్రతి తెలుగింటిలోనూ వెలిగిపోతోంది. ప్రేమీ విశ్వనాద్ నటనకు మహిళా ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కాగా మ‌ళ‌యాళంలో ఈ సీరియ‌ల్ ముగిసిపోయింది. కార్తీక దీపం సీరియల్‌కి, మళయాళ కారుముత్తుకి మధ్య కథలో కాస్త మార్పులు ఉన్నప్పటికీ రెండు సీరియల్స్ మూల కథ ఒక్కటే.. మళయాళంలో కార్తీక్, దీపలు విడిపోవడం, దీప గతం మర్చిపోయి..వేరే వ్యక్తిని ప్రేమించడం, కార్తీక్ క్యాన్సర్ వ్యాధితో కెనడా వెళ్లిపోవడం, చివరకు గతం గుర్తుకువచ్చిన దీప తిరిగి కార్తీక్‌ను వెతుక్కుంటూ అత్తగారు సౌందర్య ఇంటికి రావడం, చివరకు కార్తీక్, దీప కలవడంతో సీరియల్ ముగిసింది.