(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గాలివాన వస్తున్నపుడు ఆకాశం ఉరుములు మెరుపులతో దద్దరిల్లుతుంది. ఆకాశంలో మెరుపులు పుట్టి కనులు మిరిమిట్లు గొలుపుతూ కిందకు దిగి అంతర్ధానమైపోతాయి. అవి భూమి వరకూ వస్తే అవే పిడుగులు అవుతాయి. మెరుపుల ప్రస్థానాన్ని మనం స్పష్టంగా చూడలేం. కారణం అవి ప్రయాణించే వేగం, ఆ సమయంలో ఉద్భవించే కాంతి చాలా ఎక్కువగా ఉండడమే.
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో తీసిన ఒక వీడియో మెరుపులను స్లో మోషన్లో రికార్డు చేసింది. ఈ అద్భుతమైన వీడియో ఆన్లైన్కు రాగనే వైరల్ అయిపోయింది. మొన్న ఆదివారం టెక్సాస్ ప్రాంతంలో వచ్చిన గాలివాన స్పైస్ఉడ్ పట్టణం సమీపించినపుడు రెయిన్ బిలావిస్కీ అనే 28 ఏళ్ల ఫోటోగ్రాఫర్ తన ఐఫోన్ నుంచి ఈ వీడియో తీశాడు.
ఆ రాత్రి చాలా టోర్నడోలు పుట్టాయనీ, ఒకటి తన ఇంటికి 5 మైళ్ల దూరంలో భూమిని తాకిందనీ అతను చెప్పినట్లు ఇండిపెండెంట్ వెబ్సైట్ తెలిపింది. తాను కూడా ఇక ప్రమాదం, ఇక్కడనుంచి వెళ్లాలి అనుకుంటూనే చివరిసారిగా వీడియో తీశాననీ, అది బాగా వచ్చిందనీ బిలావిస్కీ చెప్పాడు.