(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఓ కోతి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని యాంజెంగ్ వైల్డ్ యానిమల్ వరల్డ్ లో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మెంగ్‌మెంగ్ అనే యువతి జూలో పనిచేస్తోంది. అందులో ఓ కోతి యోగక్షేమాలను మెంగ్‌మెంగ్ చేసుకుంటోంది. బుధవారం ఆమె కొన్ని నిత్యావసర వస్తువుల కోసం ఆన్లైన్లో వెతికింది. ఆ సమయంలో కోతి కూడా దాన్ని గమనించింది. తర్వాత ఫోన్ ఇంట్లోనే పెట్టి కోతికి ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి ఆన్లైన్లో ఫుడ్ఆర్డర్ అయినట్టు మొబైల్ కు సమాచారం వచ్చింది. దీంతో కంగుతిన్న యువతి.. ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ కోతి తన చేతికి చిక్కిన స్మార్ట్ ఫోన్ ను తీసుకుని, ఏకంగా ఆన్ లైన్ లో షాపింగ్ చేసి.. ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగా గుర్తించింది.
https://youtu.be/rShvtdYOGko
తనను ప్రతి రోజు ఆ కోతి గమనించడం ద్వారా ఆన్లైన్లో షాపింగ్ చేయడం నేర్చుకుందని మెంగ్‌మెంగ్ తెలిపింది. ఆ కోతికి తన ఫోన్‌తో ఆడటం చాలా ఇష్టమని అలా తనను అనుకరించేదని చెప్పింది. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.