రంగంలోకి దిగిన సోనియా

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎను నిలువరించేందుకు యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిజెపియేతర ప్రభుత్వం ఏర్పాటు దిశలో భాగంగా యుపిఎ భాగస్వామ్య పార్టీలతో పాటు తటస్థంగా ఉన్న పార్టీ నేతలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 23వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి, టిఆర్ఎస్ అధినేత  కె చంద్రశేఖరరావులకు సోనియా గాంధీ ఆహ్వానాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.  బిజెడి అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాధ్ స్వయంగా మాట్లాడి 23న జరిగే సమావేశానికి హజరు కావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది యదార్థం.

నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే టిఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించిన కెసిఆర్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపించారు. అదే విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్మోహనరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో చావుదెబ్బతీసిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ దేశంలో మారిన రాజకీయ పరిణామాల క్రమంలో మోది నేతృత్వంలోని ఎన్‌డిఎను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ పాత మిత్రుల స్నేహాన్ని ఆహ్వానిస్తోంది.

నేడు కేంద్రంలో బిజెపికి స్వతహాగా సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని వివిధ సర్వేల ద్వారా వెల్లడి అవుతున్న నేపథ్యంలో బిజెపియేతర పక్షాలతో సంప్రదింపుల కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుడుతోంది.


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

33 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

34 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

1 hour ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago