పోలీసు రౌతుల జాత్యహంకారం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఇద్దరు పోలీస్ అధికారులు గుర్రాలపై వెళ్తూ ఓ నల్లజాతి వ్యక్తిని తాడుతో చేతులు వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఆ ఘటన చూస్తుంటే అమెరికా యావత్తు తలదించుకోవాల్సిందే. టెక్సాస్ లోని గాల్వెస్టన్ లో డొనాల్డ్ నీలీ అనే నల్లజాతి వ్యక్తిని అరెస్టు చేసి.. తాడుతో చేతలు కట్టిసి.. పోలీస్ అధికారులిద్దరూ గుర్రాలపై కూర్చుని అతడిని నడిపించుకుంటూ వెళ్ళారు. ఆగస్టు 3న జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో తాజాగా బయటకు వచ్చింది.

Video Courtesy: The guardian

ఇద్దరు పోలీసులు అధికారులు ధరించిన బాడీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీనిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. నీలీ మానసిక వ్యాధిగ్రస్తుడని అతని న్యాయవాది తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన టెక్సాస్ పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పారు. గాల్వెస్టన్ పోలీసు ఉన్నత అధికారి వెర్నన్ హేల్ వివరణ ఇస్తూ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన డొనాల్డ్ నీలీని అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులో తీసుకుని వెళ్ళాల్సి ఉంది. కానీ ఆ ప్రాంతంలో ఉన్న గుర్రపు పోలీసులు తీసుకువెళ్ళడంతో ఈ వివాదం చోటు చేసుకుందని తెలిపారు. గుర్రాలపై తిరుగుతూ విధులు నిర్వహించే అధికారులకు సంబంధించిన శిక్షణ, విధివిధానాల్లో మార్పులు చేస్తామని పోలీస్ చీఫ్ వెర్నన్ హేల్ తెలిపారు. ఇది దురుద్దేశంతో చేసిన చర్య కాదని, ఇలాంటి పద్ధతులు ఇకముందు అమలు చేయకుండా నిబంధనల్లో మార్పులు చేసినట్లు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనతో ఆఫ్రికన్ ప్రజలను అవమానించారని, పోలీసులపై చర్యలు తీసుకువాలని నల్ల జాతీయులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా తన జాత్యాహంకారాన్ని వదలలేదు, ఈ ఫోటో చూస్తుంటే గతంలో నల్ల జాతీయులని కొట్టి చంపిన ఘటనలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి  అంటూ మండిపడుతున్నారు.