గాంధీజీ ఆత్మహత్య చేసుకున్నాడట!

 (న్యూస్ ఆర్బిట్ డెస్క్)

జాతిపిత మహత్మా గాంధీని ఎవరైనా హత్య చేశారా లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? మనల్ని ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ఇదేంటి వీడికి మతి పోయినట్లుంది అని అనుకోవడం ఖాయం. అలాంటిది మహాత్మా గాంధీ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్న అడిగిన వాడి సంగతేమో గానీ విన్న మనకే మతి పోవడం ఖాయం.

గాంధీజీ పుట్టిన గుజరాత్ రాష్ట్రంలోనే విద్యార్థులకు ఒక పరీక్షల్లో ఈ ప్రశ్న ఎదురయింది. తొమ్మిదవ తరగతి ఇంటర్నల్స్‌ ప్రశ్నపత్రంలో మహాత్మా గాంధీ  ఆత్మహత్య ఎలా చేసుకున్నాడు అన్న ప్రశ్న ఇచ్చారు. ‘సుఫలం శాలా వికాస్ సంకుర్’ అనే పథకం కింద నడిచే స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ అనుభవం ఎదురయింది. మరి విద్యార్థులు ఏ విధంగా జవాబు రాశారో తెలియదు కానీ, సంగతి బయటకు రాగానే అధికారులు తలపట్టుకున్నారు. ఈ ప్రశ్న ఎలా వచ్చిందో తెల్చేందుకు విచారణ జరిపిస్తున్నామని ప్రకటించారు.

‘ది హిందూ’ సౌజన్యంతో..