ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Share

ముంబై: బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫ్యాన్స్‌ని చూసి భయపడింది. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ‘కరోనా వైరస్’తో ప్రజలు, సెలెబ్రిటీలు కూడా ఆందోళన చెందుతున్నారు. దాంతో సన్నీ కూడా తెగ జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు సన్నీ లియోన్  ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తున్నారు. సన్నీ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. అభిమానులకు సన్నీ కూడా సెల్ఫీలు ఇచ్చేందుకు వెనుకాడరు. అయితే బుధవారం మాత్రం సన్నీ ఫ్యాన్స్‌కి వింత అనుభవం ఎదురైంది. విహారయాత్ర నుంచి తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ ముంబయికి వచ్చింది. అక్కడ సన్నీలియోన్ తో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించారు. కానీ, సన్నీ మాత్రం అందుకు అనుమతించలేదు. దానికి కారణం ఏంటి అంటే ‘కరోనా వైరస్’.

చైనాలో ఈ వైరస్ బారిన పడి దాదాపు 150 మందికి పైగా చనిపోయారు. ఈ వైరస్ భారత్‌లోనూ వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదీ కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలంతా ఎయిర్‌పోర్ట్‌లోనే తిరుగుతుంటారు. అలా వచ్చిన వ్యక్తులలో ఎవరికీ ఎలాంటి వైరస్ ఉన్నదో చెప్పడం కష్టం. అందుకే సన్నీ ఫ్యాన్స్ సెల్ఫీ కావాలని అడిగినప్పుడు కాస్త వెనుకడుగు వేశారు. అయినా కూడా ఓ యువతి సెల్ఫీ కోసం సన్నీ వద్దకు వెళ్లగానే ఆమె వెంటనే తన వద్ద ఉన్న మాస్క్‌తో ముక్కు, నోరు మూసేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో సన్నీతో సెల్ఫీ దిగాలి అనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది.

https://www.instagram.com/p/B75SyG5gbxM/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

అయితే తాను ఫ్యాన్స్‌తో అలా ప్రవర్తించినందుకు ఏమాత్రం బాధపడటంలేదని సన్నీ తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ తో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై అవగాహన పెంచుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొరోనా వైరస్ మనకు ఎందుక వస్తుంది అని మాత్రం అనుకోకండి. స్మార్ట్‌గా ఉండండి, సేఫ్‌గా ఉండండి’ అని పేర్కొంటూ తన భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

https://www.instagram.com/p/B75FdBnBNM-/?utm_source=ig_embed

 


Share

Related posts

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్న దిశ నిందితుల కుటుంబాలు

Mahesh

అమరావతిలో అంతా గందరగోళమే!

Mahesh

‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది’

Mahesh

Leave a Comment