టాప్ స్టోరీస్

మత సామరస్యం విషమైన వేళ!

Share

దేశంలో మత సామరస్యం గురించి అందరూ నీతులు చెప్పేవారే. సహనానికి, సర్వమానవ సౌభ్రాతృత్వానికీ హిందూమతం మారుపేరని అందరూ మోగేవారే. అయితే ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది. పక్క మతం ఉనికిని కూడా భరించలేని వారు తయారవుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. తమ విపరీత భావాలకు భిన్నంగా ఎవరన్నా మంచి చెబితే వారిపై కక్ష కడుతున్నారు. వెంటాడుతున్నారు. అందుకు నేటి డిజిటల్ ప్రపంచంలోని టెక్నాలజీని ఉపయెగించుకుంటున్నారు.

ఈ ధోరణి బాధితులలో వ్యక్తులే కాదు వాణిజ్య సంస్థలు కూడా ఉంటున్నాయి. తాజాగా హిందూస్థాన్ యూని లీవర్ సంస్థ ఆ జాబితాలో చేరింది. కొద్ది రోజులుగా ఆ కంపెనీపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. కారణం ఆ సంస్థ ఉత్పత్తులలో ఒకటైన సర్ఫ్ ఎక్సెల్ వాణిజ్య ప్రకటన. రానున్న హోలీ పండుగను దృష్టిలో ఉంచుకుని మత సామరస్యాన్ని  హృదయానికి హత్తుకునే విధంగా చిత్రిస్తూ హిందుస్థాన్ యూని లీవర్ ఒక టివి ప్రకటన విడుదల చేసింది. అది మీరూ చూడండి:

దీనిని చూసి హిందుత్వ వాదులు శివాలెత్తిపోయారు. సోషల్ మీడియాలో రకరకాలుగా ఆ సంస్థపై దుష్ప్రచారానికి దిగారు. #boycottSurfexcel అనే హాష్‌టాగ్ ట్విట్టర్‌లో వైరల్ అయింది. వీడియో హిందువులను అవమానించే రీతిలో ఉందని విమర్శించడం మొదలుపెట్టారు.

అంతటితో ఆగలేదు. సర్ఫ్ ఎక్సెల్‌లో ఉండకూడని పదార్ధాలు ఉన్నాయి కాబట్టి దానిని బాయ్‌కాట్ చేయాలంటూ ఒక ఫేక్‌న్యూస్ ప్రచారంలోకి తెచ్చారు. హిందువుల మనోబావాలు దెబ్బతీసిన కారణంగా హిందూస్థాన్ యూని లీవర్ సంస్థకు పది కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించినట్లు మరో ఫేక్‌న్యూస్ తయారు చేశారు. ఇంకా కొన్ని బూటకపు వార్తలు చలామణీలో పెట్టారు..

అయితే ఈ ప్రకటనకు పొగడ్తలు అందకపోలేదు. చాలామంది ట్విట్టర్ ఖాతాదారులు ఇంత చక్కగా ఉన్న ప్రకటనపై ఈ దుమారం ఏమిటని వాపోయారు. ఫిబ్రవరి 27న విడుదల అయిన ఈ ప్రకటన వీడియోను ఇప్పటికి 77 లక్షల మందికి వీక్షించారు.


Share

Related posts

మోదీ ఘనవిజయం వెనుక…!

Kamesh

‘రాజధానిపై భిన్నాభిప్రాయాలు లేవు’

somaraju sharma

ఏ విలువలకు వీరు ప్రతినిధులు!?

Siva Prasad

Leave a Comment