పెగాసస్ స్పైవేర్ బాధితులు వీరే!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఇజ్రాయెలీ స్పైవేర్ ‘పెగాసస్’ ద్వారా ఇండియాలో కొందరు హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదుల మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారన్న వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, గోవాలో డజను మందికి పైగా హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు మొబైల్స్ హ్యాక్ అయిన వారిలో ఉన్నారు. వీరందరూ దాదాపుగా భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషద్ కేసులతో సంబంధం ఉన్నవారు.

ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం బాధితుల వివరాలు:

రవీంద్రనాథ్ భల్లా: తెలంగాణ హైకోర్టు లాయర్. ‘రాజకీయ ఖైదీల విడుదల కోసం ప్రయత్నించే కమిటీ’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభాగం ప్రధాన కార్యదర్శి.

శాలిని గెరా: బస్తర్ కేంద్రంగా పని చేసే న్యాయవాది. భీమా కోరేగావ్ కేసులో నిందితురాలు సుధా భరద్వాజ్ తరపు న్యాయవాది.  ‘జగదల్‌పూర్ లీగల్ ఎయిడ్ గ్రూప్’ సహ వ్యవస్థాపకురాలు.

ఆనంద్ తేల్‌తుంబ్డె: పౌర హక్కులు, దళిత హక్కుల కార్యకర్త. గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్‌లో ప్రొఫెసర్. ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయ్యారు. తర్వాత విడుదలయ్యారు.

బేలా సోమారి/భాటియా: బస్తర్ కేంద్రంగా పని చేసే హక్కుల కార్యకర్త, న్యాయవాది.

నిహాల్ సింగ్ రాథోడ్: నాగపూర్ కేంద్రంగా పని చేసే న్యాయవాది. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ దగ్గర జూనియర్‌గా పని చేస్తున్నారు.

జగదీష్ మేష్రామ్: గడ్జిరోలి కేంద్రంగా పని చేసే న్యాయవాది. ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్’ సభ్యుడు.

అంకిత్ గ్రెవాల్: చండీగఢ్ కేంద్రంగా పని చేసే మానవహక్కుల న్యాయవాది. ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్’ జాయింట్ సెక్రటరీ.

వివేక్ సుందర: ముంబై కేంద్రంగా పని చేసే హక్కులు, పర్యావరణ వ్యవహారాల కార్యకర్త.

డిగ్రీ ప్రసాద్ చౌహాన్: చత్తీస్‌గఢ్ కేంద్రంగా పనిచేసే గిరిజన, దళిత,  మానవహక్కుల కార్యకర్త. పియుసిఎల్ చత్తీస్‌గఢ్ శాఖ సభ్యుడు.

సీమా ఆజాద్: మానవహక్కుల కార్యకర్త. పియుసిఎల్ సభ్యురాలు. ‘దస్తక్ నయే సమయ్ కీ’ అనే హిందీ పత్రికను అలహాబాద్ నుంచి నడుపుతున్నారు.

డాక్టర్ సరోజ్ గిరి: ఢిల్లీ యూనివర్సిటీలో రాజకీయ శాస్త్రం టీచర్.

అమర్ సింగ్ చాహల్: చండీగఢ్ కేంద్రంగా పని చేసే మానవహక్కుల న్యాయవాది. ‘లాయర్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్’ సభ్యుడు.

రాజీవ్ శర్మ: ఢిల్లీ కేంద్రంగా పని చేసే కాలమిస్టు. స్ట్రాటజిక్ ఎఫైర్స్ విశ్లేషకుడు.

శుభ్రాంశు చౌదరి: గతంలో బిబిసిలో పని చేశారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్ కేంద్రంగా ‘శాంతి జర్నలిజం’ నడుపుతున్నారు.

సంతోష్ భారతీయ: ఢిల్లీ కేంద్రంగా పని చేసే జర్నలిస్టు. ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ‘చౌతీ దునియా’ ఎడిటర్.

ఆశిష్ గుప్తా: ఢిల్లీ కేంద్రంగా పని చేసే జర్నలిస్టు. మానవహక్కుల కార్యకర్త. ‘అసోమియా ప్రతిదిన్’ బ్యూరో చీఫ్.

సిద్ధాంత్ సిబల్: ఢిల్లీ కేంద్రంగా పని చేసే జర్నలిస్టు. ‘వియాన్’ న్యూస్ ఛానల్‌లో దౌత్య, రక్షణ వ్యవహారాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.

డాక్టర్ అజ్మల్ ఖాన్:s   ఢిల్లీ కేంద్రంగా పని చేసే మానవహక్కుల కార్యకర్త.