అతడిని విడిచిపెట్టేయండి : ఢిల్లీ హైకోర్టు

తందూరీ హత్య కేసులో జైలులో ఉన్న దోషిని తక్షణమే విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1995లో దేశ వ్యాప్తంగా తందూరీ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగీతి తెలిసిందే. ఈ కేసులో దోషి గా తేలిన సుశీల్ శర్మకు కోర్టు అప్పట్లో జీవిత ఖైదు విధించింది.  సుశీల్ శర్మ తన భార్య నైనా సాహ్నిని హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి రొట్టెలను తయారు చేసే తందూరీలో కాల్చి వేశాడు. ఆ కేసులో సుశీల్ శర్మకు కోర్టు యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.

రెమిషన్లు సహా పాతిక సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. అయితే శిక్ష పూర్తయిన తరువాత కూడా సుశీల్ శర్మను జైలులోనే ఉంచడంపై ఢిల్లీ హైకోర్టు రాష్ట్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్షాకాలం పూర్తయినా విడుదల చేయకుండా జీవిత కాలం జైలులోనే ఉంచుతారా అని ప్రశ్నించింది. శిక్ష పూర్తయిన తరువాత కూడా జైలులోనే ఉంచడం సుశీల్ శర్మ హక్కులకు భగం కలిగించడమే అవుతుందని పేర్కొంది. తన శిక్షాకాలం పూర్తయ్యిందనీ, వృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత తనపై ఉంది కనుక విడుదల చేయాలనీ కోరుతూ సుశీల్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆయనను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.

284 × 189

SHARE