NewsOrbit
టాప్ స్టోరీస్

తొడగొట్టిన శ్రీనివాస్‌కు వర్ల జవాబు!

అమరావతి: పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె శ్రీనివాసరావు, మాజీ పోలీస్ అధికారి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీడియా సాక్షిగా ఖబడ్జార్ అంటూ వర్ల రామయ్యకు హెచ్చరికలు జారీ చేయడంతో వీరి పంచాయతీ చివరకు డీజిపి వద్దకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

పోలీస్ జాతకాలు నీకు తెలియడం కాదు. నీ జాతకమే మా దగ్గర ఉంది అంటూ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె శ్రీనివాసరావు వర్ల రామయ్యను ఉద్దేశించి మీసం మెలేసి, తొడకొట్టి ఖబడ్డార్ అంటూ హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఈ వ్యాఖ్యలపై వర్ల రామయ్య తీవ్రంగా స్పందిస్తూ ఆయన చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

శ్రీనివాస్ పోలీస్ అధికారా లేక ప్రత్యర్థి పార్టీకి చెందిన రాజకీయ  నాయకుడో అర్థం కావడం లేదని వర్ల అన్నారు.

తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం ద్వారా ఆయన తనను యుద్ధానికి పిలుస్తున్నాడో, కుస్తీకి రమ్మంటున్నాడో తెలియడం లేదని వర్ల అన్నారు. రాజకీయ నాయకులు కూడా మాట్లాడని విధంగా శ్రీనివాసరావు భాష, ప్రవర్తన ఉన్నాయని వర్ల పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోలీసులను దుర్భాషలాడినప్పుడు ఈ పోలీస్ అధికారుల సంఘం నేత ఎందుకు స్పందించలేదని వర్ల ప్రశ్నించారు. చెవిరెడ్డిలా తానేమీ హద్దుమీరి మాట్లాడలేదని వర్ల అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఒన్ టౌన్ స్టేషన్‌లో ఒక ఎస్‌సి సర్కిల్ ఇన్స్‌‌పెక్టర్ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారనీ, నిమిషాల మీద ఆ ఇన్స్‌పెక్టర్‌ని బదిలీ చేయించారనీ ఇప్పటికీ అతనికి పోస్టింగ్ కూడా ఇవ్వలేదని వర్ల గుర్తు చేస్తూ దీనిపైనా ఈ పోలీసు అధికారుల సంఘ నేత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వైజాగ్ విమానాశ్రయంలో సీనియర్ ఐపిఎస్ అధికారిపై గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహనరెడ్డి ఎంత దురుసుగా ప్రవర్తించారో ఈ శ్రీనివాసరావుకు తెలియదా అని ప్రశ్నించారు. వారంతా పెదరెడ్లని వదిలివేసి, ఎస్‌సిననే ఉద్దేశంతో శ్రీనివాసరావు తనపై తొడగొట్టి, మీసం తిప్పాడా అని వర్ల ప్రశ్నించారు.

ఎస్‌సి నేతలను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడిన శ్రీనివాసరావుపై డిజిపి వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసరావుకు విలేఖరుల సమావేశం నిర్వహించే అర్హత ఎక్కడుందని వర్ల నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

వీడియో ఎబిఎన్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment