NewsOrbit
టాప్ స్టోరీస్

కేసీఆర్ పెద్ద ప్రయోగమే… 1897 చట్టం…!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్రమంతా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అత్యవసర సేవలు తప్ప మిగతావన్నీ మార్చి 31 వరకు క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి ఈ మహమ్మారిని తరిమికొట్టాలని కోరారు. అయితే ఈ విపత్కర సమయంలో ఎవరైనా ప్రభుత్వానికి సహరించకుంటే కఠినచర్యలు తీసుకుంనేందుకు వీలుగా బ్రిటిష్ కాలం నాటి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897ను అమలులోకి తెస్తున్నామని ఆయన ప్రకటించారు.

నన్ను దింపేసి.. నా కారు కూడా తీసుకెళ్లే పవర్

సీఎస్ కింద కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ ఎపిడమిక్ చట్టం అమలులోకి రావడంతో కలెక్టర్లకు ఫుల్ పవర్స్ వస్తాయన్నారు. అత్యవసర పరిస్థితి అనిపిస్తే తాను ఎక్కడికైనా వెళ్తుండగా ఆపేసి.. తన కారును సైతం తీసుకుని సహాయ చర్యలు చేపట్టే అధికారం కలెక్టర్లకు ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ప్లేగు వ్యాధి బాగా ప్రబలుతున్నప్పుడు మొదటగా ముంబయిలో 1897లో బ్రిటిష్ వారు ఈ చట్టాన్ని ప్రయోగించారు. తరువాత కాలానుగుణంగా తీవ్ర వ్యాధుల సమయంలో బయటకు తీస్తున్నారు.

గతంలో ఎపిడమిక్ డిసీజ్ చట్టం అమలు..

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ యాక్ట్ అమల్లోకి తెస్తారు.

2018 లో మలేరియా కోసం ప్రబలినప్పుడు గుజరాత్‌లో ఈ చట్టాన్ని వాడారు.

2015లో చండీగఢ్‌లో డెంగ్యూ వచ్చినప్పుడు, 2009లో పూణేలో స్వైన్‌ ఫ్లూ విజృంభించినప్పుడు దీన్ని అమలులోకి తెచ్చారు.

చట్టం అధికారాలివే

రాష్ట్రంలో నేటి నుంచి ఏడాది పాటు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ – 1897 అమలులో ఉంటుంది.

ఈ చట్టం కింద నిబంధనలు, అధికారాలను ‘తెలంగాణ ఎపిడమిక్ డిసీజెస్ (కోవిడ్-19)’ రెగ్యులేషన్ అని విడుదల చేసింది.

పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విద్యా పరిషత్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లకు వారి పరిధిలో కరోనా నియంత్రణకు నిర్ణయాలు తీసుకునే అధికారం.

కరోనా లక్షణాలున్న వారిని ప్రభుత్వం నోటిఫై చేసిన ఆస్పత్రుల్లో మాత్రమే చేర్చుకోవాలి.

అనుమానితులు ఎవరైనా చికిత్సకు నిరాకరిస్తే అధికారులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించొచ్చు.

ప్రభుత్వానికి సహకరించని వారిపై కేసులు కూడా పెట్టొచ్చు.

ఒక ప్రదేశంలో కరోనా కేసు నమోదైతే ఆ ప్రాంతంపై జిల్లా కలెక్టర్‌కు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం శిక్షార్హులు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment