NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ పార్టీ ఎందుకిలా మారిపోతుంది…?

 

(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

అపర మేధావి, రాజనీతిజ్ఞుడు, దివంగత మాజీ ప్రధాన మంత్రి పివి నర్శింహరావుకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తీర్మానం చేసి తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్) క్రెడిట్ కొట్టేశారు. ఇది ఒక విధంగా కెసిఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగమే అయి ఉండవచ్చు కూడా. అసలు పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన తెలంగాణ కాంగ్రెస్ గమ్మున ఉండటానికి కారణం లేకపోలేదు. పివి అంటే సోనియమ్మకు ఇష్టం ఉండదనీ, ఆయన పేరు చెబితేనే అగ్గిలం మీద గుగ్గిలం అవుతుందనీ ఆ పార్టీ నేతలందరికీ తెలిసిన విషయమే. పివికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఎవరైనా ముందుకు వచ్చి డిమాండ్ చేసినా, తీర్మానం ప్రవేశపెట్టినా ఆ నేతలకు అధిష్టానం వద్ద చీటీ చిరిగి పోతుందన్న భయం ఉందని అంటున్నారు. అందుకే ఈనాటి వరకూ కాంగ్రెస్ నేతలు ఆ విషయంపై నోరు ఎత్తలేదు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగకపోయినా కెసిఆర్ స్వయంగా పివికి భరతరత్న ఇవ్వాలంటూ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు కేంద్రానికి కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి పివి తమ వాడే ఓన్ చేసుకున్నాడు కెసిఆర్. సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనంత వరకూ మెజార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే వారు. పివి మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరు ఫలితంగా, ఇతర కారణాల కారణంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లు అధికంగాా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. తెలంగాణలో ఎక్కువగా టిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, బిజేపి అనుకూలంగా మారిపోయారు. కెసిఆర్ తొలి నుండి బ్రాహ్మణ సామాజిక వర్గం నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అవసరమైన సందర్భాలలో సూచనలు, సలహాలు తీసుకోవడం ఆయనకు అలవాటు.

పివికి భారతరత్న ఇవ్వాలంటూ గతంలో బ్రాహ్మణ సంఘాలు ఒకటి రెండు పర్యాయాలు డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున ఒత్తడి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో మెజార్టీ బ్రాహ్మణులు భుజాన పార్టీ జెండా పట్టుకుని తిరగకపోయినా ఓటింగ్ విషయానికి వచ్చే సరికి టిఆర్ఎస్ అనుకూలం అన్న విషయం కెసిఆర్ కు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడగకపోయినా స్వయంగా తానే పివికి భారతరత్న ఇవ్వాలని కెసిఆర్ ప్రతిపాదించడంతో టిఆర్ఎస్ అనుకూలంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు చెక్కు చెదరకుండా ఉండటంతో పాటు బిజెపి, కాంగ్రెస్ పక్షాలకు అనుకూలంగా ఉన్న కొద్ది పాటి బ్రాహ్మణ ఓట్లు కూడా ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో దూర చూపుతో ఆలోచన చేసి కెసిఆర్ ఆలోచన చేసి సక్సెస్ అవ్వగా, తెలంగాణ కాంగ్రెస్ ఫేయిల్ అయ్యింది. తమ పార్టీ నాయకుడు పివి అని గట్టిగా వాదించి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయలేకపోవడం దురదృష్టకరం. పివి పేరు ఎత్తితే ముస్లిం మైనార్టీ వర్గాలు దూరం అవుతాయన్న భయం కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది. పివి హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిన నేపథ్యంలో ఆ పాపంలో ఆయన పాత్ర కూడా ఉందని ఆ వర్గాలు నమ్ముతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మేధావి, అపర చాణిక్యుడుగా పేరొందిన తెలంగాణ బిడ్డ పివికి భారతరత్న ఇవ్వాలని టిఆర్ఎస్ సర్కార్ కోరడం ముదావహం.

 

author avatar
Special Bureau

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk