హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది. జులైలో ఇచ్చిన నోటిఫికేన్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపించాలని హైకోర్టు సూచించింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. మునిసిపల్ ఎన్నికలపై గత కొన్ని నెలలుగా హైకోర్టులో వాదప్రతివాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచగా శుక్రవారం తీర్పును వెల్లడించింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని హైకోర్టు సూచించింది.
previous post
next post