శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత

అయ్యప్పను దర్శింకునేందుకు వచ్చిన మహిళల బృందం

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

శబరిమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్త్నెకి చెందిన మణితి సంస్ధ తరపున దాదాపు 50 మంది మహిళల బృదం శబరిమల బయలుదేరింది. తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళకు చెందిన మహిళలతో కూడిన ఈ మహిళల బృందం శబరిమల సన్నిధానానికి చేరుకోనున్నట్లు మణితి సభ్యురాలు ఒకరు తెలియజేశారు. అయ్యప్పను దర్శించుకునేందుకు వస్తున్న మహిళాబృందాన్ని అడ్డుకునేందుకు ఆందోళనకారులు సిద్ధమయ్యారు. శబరిమల పవిత్రతను కాపాడాలంటు వారు నినాదాలు చేశారు. దీంతో శబరిమలలో మరోసారి ఉద్రికత తెలెత్తింది. మహిళల బృందం అయ్యప్పను దర్శించుకోవాలని పట్టుదలతో ఉంది. కాగా, ఎట్టి పరిస్ధితుల్లోనూ మహిళాబృందాన్ని శబరిమల చేరనివ్వబోమని హిందూ ఐక్యవేదిక స్పష్టం చేసింది.

అయ్యప్పను దర్శింకునేందుకు వచ్చిన మహిళల బృందం

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కొట్టాయం రైల్వే స్టేషన్‌ దగ్గరికి వచ్చిన ఐక్యవేదిక ప్రతినిధులు అందోళనకు దిగారు. అన్ని వయసుల మహిళలు శబరిమలను దర్శించుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా శబరిమల యుద్ధభూమిగా మారిన సంగతి తెలిసిందే.  గత నెలలో ఆలయ ద్వారాలు తెరచి ఉన్న రోజులలో కేరళలో మధ్య ఘర్షణలు  చేలరేగాయి.  ఇప్పుడు తిరిగి శబరిమలలో మరోసారి ఉద్రికత  నెలకొనడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఉద్రిక్తత దృష్ట్యా పోలీసులు పంబ ప్రాంతంలో 144 సెక్షన్ విధింపును డిసెంబర్ 27 వరకూ పొడిగించారు.