టాప్ స్టోరీస్

టిక్ టాక్ స్టార్ షారుఖ్ ఖాన్ అరెస్ట్!

Share

ఢిల్లీ: టిక్ టాక్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం కేసులో షారుఖ్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 23 ఏళ్ల షారుఖ్ ఖాన్ కి టిక్ టాక్‌లో 40 వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి అల్ఫా 2 ఏరియాలో దోపిడికి పాల్పడేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసే వారని షారూఖ్ ఖాన్, ఫైజాన్, ఆసీఫ్‌, ముకేష్‌లుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు సంబంధించి నాలుగు మొబైల్ ఫోన్స్, రూ. 3, 520 నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

షారూఖ్ ఖాన్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌గా ఏర్పడే వారని, ఇద్దరు వ్యక్తులు బైక్‌లపై తిరుగుతూ దొంగతనం చేసేందుకు రెక్కీ చేసే వారన్నారు. షారూఖ్ ఖాన్, ఫైజాన్, ఆసీఫ్‌లు యూపీలోని బులంద్‌షహర్ కు చెందిన వారు కాగా..ముఖేష్ బీహార్ రాష్ట్రానికి చెందిన వాడని చెప్పారు. బేటా 2 పీఎస్‌లో దొంగతనం కేసును నమోదు చేశామని, కోర్టులో వీరిని హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

 


Share

Related posts

‘ఏపి రాజధాని భీమిలి’

somaraju sharma

అక్షయ్‌ సింగ్‌ పిటిషన్ ను విచారించనున్న సుప్రీం!

Mahesh

అమెరికాకి కరోనా కళ్లెం

somaraju sharma

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar