టాప్ స్టోరీస్

మిమిక్రీ జైలుకు పంపింది!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అవదేశ్ దూబే రైళ్లలో బొమ్మలు అమ్ముకుని పొట్టపోసుకుంటాడు. మంచి మాటకారి కావడంతో నరంద్ర మోదీ సహా  రాజకీయ నాయకులను అనుకరించి మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటాడు. అతని వీడియో ఒకటి వైరల్ అయిన వారం రోజులకు రైల్వే పోలీసులు శుక్రవారం దూబేను సూరత్ దగ్గర అరెస్టు చేశారు.

దూబేను రైల్వే పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అక్రమంగా రైలు బోగీలోకి ప్రవేశించడం, రైలు బోగీలో అక్రమంగా విక్రయాలు జరపడం, పనికిరాని వాగుడు వాగడం అతనిపై మోపిన అభియోగాలు. తప్పు చేశానని దూబే అంగీకరించడంతో మెజిస్ట్రేట్ ఆతనికి 3,500 రూపాయల జరిమానా విధించారు. పది రోజుల జ్యుడీషియల్ కష్టడీకి పంపించారు.

వారణాసికి చెందిన దూబే రెండేళ్ల క్రితం గుజరాత్‌లోని వల్సాడ్‌కు వలస వెళ్లాడు. రైలులో బొమ్మలు అమ్మేప్పుడు అతని మిమిక్రీ చూసి గుజరాత్‌కు చెందిన ప్రముఖ స్టాండ్‌అప్ కమెడియన్ మనన్ దేశాయ్ ఫిబ్రవరిలో ఈ వీడియో తీశాడు. అందులో దూబే మాటలు కొందరు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండడంతో ఎన్నికలు అయిపోయేంతవరకూ ఆగి తర్వాత యుట్యూబ్‌లో అప్‌లోడ్ చేశానని దేశాయ్ స్క్రోల్ వెబ్‌సైట్‌కు చెప్పాడు.

తాను అతని అనుమతి తీసుకునే వీడియో అప్‌లోడ్ చేశాననీ, అయితే ఇది జైలు వరకూ వెళుతుందని తాను కానీ ఆఖరికి దూబే కానీ అనుకోలేదనీ అతను పేర్కొన్నాడు. రైలు బోగీల్లో అమ్మకాలు సాగించేవారిని రైల్వే పోలీసులు అప్పుడప్పుడూ అరెస్టు చేయడం, తర్వాత వదిలిపెట్టడం మామూలే. ఈసారి దూబే విషయంలో  పై అధికారుల నుంచి గట్టి ఆదేశాలు వచ్చినట్లు తనకు తెలిసిందని దేశాయ్ పేర్కొన్నాడు.

దూబే దగ్గర గొప్ప ప్రతిభ ఉందనీ, దానిని సానపెట్టదలచుకున్నాననీ కూడా దేశాయ్ చెప్పాడు. దూబేను విడుదల చేసిన తర్వాత అతనికి శిక్షణ మొదలుపెడతానని దేశాయ్ తెలిపాడు.

దూబే ప్రతిభ చూపించే ఈ వీడియోనే వైరల్ అయింది:


Share

Related posts

‘రాహుల్ వ‌ల్లే అసలు సమస్య’!

Mahesh

ఆర్ధిక బలహీన వర్గాల బిల్లు ఆమోదం

somaraju sharma

ఫిబ్రవరి 4 నుండి జగన్ సమర శంఖారావం

somaraju sharma

Leave a Comment