పాక్ ‌రైలు ప్రమాదంలో 60మంది సజీవ దహనం

 

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి బయలుదేరిన తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 60 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

తల్వారీ రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత లియాఖత్‌పూర్‌ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. రైలులోని వంటగదిలో అల్పాహారం తయారుచేస్తుండగా సిలిండర్లు పేలి ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.  మంటలు ఏకంగా మూడు బోగీలకు వ్యాపించడంతో ప్రాణనష్టం భారీ స్థాయిలో సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.