(న్యూస్ అర్బిట్ డెస్క్)
నెలల తరబడి వానలు లేక ఎండిన అడవులు అంటుకుపోయి రోజు రోజుకూ విస్తరిస్తున్న కార్చిచ్చులతో తల్లడిల్లుతున్న ఆస్ట్రేలియాను వరుణదేవుడు కరుణించాడు. తీవ్ర వర్షాభావంతో నెర్రెలిచ్చిన భూమి గురువారం అకస్మాత్తుగా కురిసిన వానలతో చల్లబడింది. మొదటిసారి వానను చూస్తున్న ఓ 18 నెలల బాలుడు అనందంతో తడుస్తూ నీటి మడుగుల్లోకి పరుగెత్తిన దృశ్యం ఆస్ట్రేలియా వాసుల మూడ్‌కి అద్దం పట్టింది. 9 న్యూస్ ఈ వీడియో పోస్టు చేసింది.
Heavy rain in Australia is bringing joy to the drought stricken continent. This 18 month old boy, is thrilled seeing it for the 1st time.
Yes. Rains after 18 months is paradise ?? pic.twitter.com/4TRY1vgkrp— Susanta Nanda IFS (@susantananda3) January 16, 2020
చరిత్రలో ఇంతవరకూ నమోదు కాని స్థాయిలో ఆస్ట్రేలియాకు ఎదురయిన వర్షాభావం వల్ల చిట్టడవులు ఎండిపోయి కార్చిచ్చులు రగిలాయి. ఫలితంగా ఇప్పటికి 29 మంది మరణించారు. లక్షలాది వన్యమృగాలు ప్రాణాలు కోల్పోయాయి. అనేక ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. వాతావరణం తీవ్ర స్థాయిలో కలుషితమైంది. ఆగ్నిమాపక దళాలు తీవ్రస్థాయిలో శ్రమించినా ఫలితం లేకపోయింది.
గురువారం కురిసిన వానల వల్ల కొన్ని కార్చిచ్చులు ఆరిపోయాయి. ఆస్ట్రేలియా దేశం మొత్తం వానలను చూసి సంతోషంతో పండగ చేసుకుంటున్నది.
It's finally raining in Australia ?❤??
"Downpours have already helped to extinguish 32 bushfires..number of blazes fell from 120 to 88..It means the end may be in sight for exhausted firefighters who have battled deadly fires for more than 3 months."
— StanceGrounded (@_SJPeace_) January 15, 2020